Begin typing your search above and press return to search.

700ల్లో 640 కరోనా కేసులు వాళ్ల వల్లేనట..!

By:  Tupaki Desk   |   17 April 2020 6:50 AM GMT
700ల్లో 640 కరోనా కేసులు వాళ్ల వల్లేనట..!
X
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ ఎన్ని జాగ్రత్తలు.. ఎంత కట్టడి చర్యలు తీసుకున్నా ఈ చైన్ సిస్టంకు తెరపడడం లేదు. దీనికి గల కారణాలను తాజాగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించింది. ఇది సంచలనమైంది.

తెలంగాణలో ఇప్పటివరకు పరీక్షించిన 700 మందిలో 640మంది కరోనా కేసులు ఢిల్లీలోని తబ్లిఘి జమాత్ సమావేశానికి హాజరైనవారు.. వారి పరిచయస్తులేనని మంత్రి ఈటెల రాజేందర్ బాంబు పేల్చారు. 50-60మంది తప్పితే మిగతా వారందరూ మార్కాజ్ వెళ్లిన వారు వారి కుటుంబ సభ్యులు - పరిచయస్తులేనని విలేకరుల సమావేశంలో సంచలన నిజం వెల్లడించారు.

హైదరాబాద్ పాతబస్తీ నుంచి మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారితో ఒక కుటుంబం లో 20 మందికి కరోనా సోకిందని.. ఆరుగురు కుటుంబాల ద్వారా వారి కుటుంబ సభ్యులు - పరిచయస్తులు మొత్తం 81మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని ఈటెల రాజేందర్ సంచలన విషయాలు వెల్లడించారు.

గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ కరోనా కేసులకు కారణం మర్కజ్ కు వెళ్లిన వారేనని ఈటల స్పష్టం చేశారు. పాతబస్తీ లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువని.. చిన్న చిన్న కుటుంబాల్లో నివసిస్తుండడంతో చాలా మందికి కరోనా సోకిందని.. అందుకే కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఇంకా చాలా మంది కరోనా పరీక్షలకు పాతబస్తీలో ముందుకు రావడం లేదని.. పోలీసులు - ఆరోగ్య కార్యకర్తలకు సహకరించడం లేదని వాపోయారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 10,000 పరీక్షలు జరిగాయని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్న ల్యాబ్‌ లు త్వరలో వాటి సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయన్నారు వీటితో పాటు హైదరాబాద్‌ లోని మరో రెండు ల్యాబ్‌ లకు పరీక్షలు నిర్వహించడానికి అనుమతి లభించిందన్నారు. మూడు వారాల్లో ఆటోమేటిక్ మెషిన్ ల్యాబ్ పనిచేస్తుందని.. ఇది ప్రతిరోజూ 5000 పరీక్షలను నిర్వహించడానికి సహాయ పడుతుందని తెలిపారు.. గచ్చిబౌలి స్టేడియం ఏప్రిల్ 20 నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.