Begin typing your search above and press return to search.

ఆస్తులు రివీల్ చేయ‌ని ఎంపీల్లో తెలుగోళ్లు ఎక్కువే!

By:  Tupaki Desk   |   4 Sep 2018 5:20 AM GMT
ఆస్తులు రివీల్ చేయ‌ని ఎంపీల్లో తెలుగోళ్లు ఎక్కువే!
X
లోక్ స‌భ‌.. రాజ్య‌స‌భకు ఎన్నికైన ఎంపీలు త‌మ ఆస్తుల లెక్క‌ల వివ‌రాల్ని వెల్ల‌డించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ విష‌యంలో దేశ వ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల సంగ‌తి ఎలా ఉన్నా..తెలుగు రాష్ట్రాల ఎంపీలు మాత్రం ఈ విష‌యంలో కాస్త వెన‌కే ఉన్నారు. ఉభ‌య స‌భ‌ల‌కు సంబంధించి 795మంది స‌భ్యులు ఉండాలి. ఖాళీగా ఉన్న స్థానాలు.. ఇటీవ‌ల కాలంలో రాజీనామాలు చేసిన ఎంపీల్ని మిన‌హాయించినా 780 కంటే ఎక్కువే ఉంటారు.

వీరిలో 94 మంది ఎంపీలు త‌మ ఆస్తుల వివ‌రాలు వెల్లడించ‌లేద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. మొత్తం ఎంపీల్లో ఇంచుమించు 13- 14 శాతం మంది ఎంపీలు త‌మ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించ‌ని వారిలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది లోక్ స‌భ‌కు ఎంపికైన వారు ఉండ‌టం గ‌మ‌నార్హం. లోక్ స‌భ‌కు ఎన్నికైన ఎంపీల్లో 65 మంది ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించ‌కుంటే.. రాజ్య‌స‌భ‌కు సంబంధించి వీరి సంఖ్య 29గా ఉంది.

ర‌చ‌నా క‌ల్రా అనే స‌మాచార హ‌క్కు కార్య‌క‌ర్త దాఖ‌లు చేసిన ద‌ర‌ఖాస్తుతో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆస్తులు ప్ర‌క‌టించ‌ని ఎంపీల్లో టీఆర్ ఎస్ కు చెందిన ఏడుగురు ఎంపీలు.. టీడీపీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఆస్తులు వెల్ల‌డించ‌ని వారిలో ఉండ‌గా.. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఒక్క‌రు మాత్ర‌మే ఆస్తుల లెక్క చెప్ప‌ని వైనం గుర్తుకు వ‌చ్చింది. ఆస్తులు లెక్క చెప్ప‌ని 94 మందిలో దాదాపు 17 శాతం మంది ఎంపీలు తెలుగు వారు కావ‌టం విశేషంగా చెప్పాలి. నిత్యం నీతులు చెప్పే రెండు అధికార‌పార్టీకి చెందిన అధినేత‌లు.. త‌మ పార్టీ ఎంపీలు ఆస్తులు ఎందుకు ప్ర‌క‌టించ‌లేద‌న్న విష‌యాన్ని ప్ర‌శ్నించ‌రా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.