Begin typing your search above and press return to search.

66 ఏళ్ల నీచుడ్ని గుర్తించిన చెన్నై బాధిత బాలిక‌

By:  Tupaki Desk   |   19 July 2018 4:14 AM GMT
66 ఏళ్ల నీచుడ్ని గుర్తించిన చెన్నై బాధిత బాలిక‌
X
నోరు విప్పి చెప్ప‌టానికి సైతం సిగ్గు ప‌డే దుర్మార్గం చెన్నైలో చోటు చేసుకోవ‌టం తెలిసిందే. బ‌ధిర బాలిక‌పై 66 ఏళ్ల వృద్ధుడైన లిఫ్ట్ ఆప‌రేట‌ర్ దుర్మార్గాన్ని బాధిత బాలిక వెల్ల‌డించింది. త‌న‌పై తొలిసారి అత్యాచారం చేసింది 66 ఏళ్ల వృద్ధుడేన‌ని వెల్ల‌డించింది. లిఫ్ట్ గార్డు.. త‌ర్వాత సెక్యురిటీ గార్డులు.. ఫ్లంబ‌ర్లు.. ఎల‌క్ట్రిషియ‌న్లు.. ఇలా మొత్తం 24 మంది త‌న‌ను అత్యాచారం చేశార‌ని పేర్కొంది.

12 ఏళ్ల బ‌ధిర బాలిక‌పై నెల‌ల త‌ర‌బ‌డి సాగిన అత్యాచార‌కాండ వెలుగులోకి వ‌చ్చి సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స్పందించిన పోలీసులు బాలిక‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం పోలీసు క‌మిష‌న‌రేట్‌ కు తీసుకొచ్చారు. అక్కడ పోలీసుల అదుపులో ఉన్న నిందితుల్ని గుర్తించారు.

ఈ సంద‌ర్భంగా ఎవ‌రు త‌న‌తో ఎంత అమానుషంగా వ్య‌వ‌హ‌రించింది బాధిత బాలిక వెల్ల‌డించింది. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు న‌మోదు చేశారు. అనంత‌రం హైకోర్టుకు తీసుకెళ్లారు. నిందితుల‌కు త‌ప్ప‌నిస‌రిగా శిక్ష ప‌డుతుంద‌ని మ‌ద్రాస్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఇందిరా బెన‌ర్జీ వ్యాఖ్యానించారు. బాలిక కుటుంబానికి ప్ర‌తి ఒక్క‌రూ నైతిక మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆమె కోరారు.

చెన్నై ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోని ప్ర‌త్యేక వార్డులో చిన్నారికి ప్ర‌త్యేక వైద్య ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆమె ఆరోగ్య ప‌రిస్థితిపై నివేదిక ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ కేసులో ఇప్ప‌టికి 17 మంది నిందితుల్ని గుర్తించ‌గా.. మ‌రో ఏడుగురి కోసం పోలీసులు ప్ర‌త్యేక ద‌ళాల్ని ఏర్పాటు చేశారు. పోలీసు అదుపులో ఉన్న నిందితుల్ని కోర్టు ఆదేశాల‌తో పుళ‌ల్ జైలుకు త‌ర‌లించారు. బాలిక‌పై జ‌రిగిన దారుణాన్ని వివిధ సంఘాల నేత‌లు.. స్వ‌చ్చంద సంస్థ‌ల ప్ర‌తినిధులు.. సామాజిక వేత్త‌లు.. ప్ర‌జ‌లు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితుల త‌ర‌ఫు వాదించేందుకే ఏ ఒక్క న్యాయ‌వాది ముందుకు రావ‌టం లేదు.