Begin typing your search above and press return to search.
నిజమైన దేశభక్తి: రష్యాతో యుద్ధానికి 66 వేల మంది ఉక్రేనియన్లు
By: Tupaki Desk | 6 March 2022 2:33 PM GMTరష్యా దండయాత్రకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనేందుకు 66,224 మంది ఉక్రేనియన్ పురుషులు విదేశాల నుంచి తిరిగి వచ్చారని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ శనివారం తెలిపారు. "ఈ సమయంలో తమ దేశాన్ని రష్యా నుండి రక్షించడానికి విదేశాల నుండి ఎంత మంది పురుషులు తిరిగి వచ్చారని తెలిపారు. ఇవి మరో 12 బ్రిగేడ్‌లుగా తయారయ్యాయన్నారు. ఉక్రేనియన్లు దేశం కోసం అజేయంగా పోరాడుతున్నారన్నారు.” అని రెజ్నికోవ్ సంచలన ప్రకటన చేశారు.
రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పుడు దుబాయ్‌లో తన కుటుంబంతో విహారయాత్రకు వెళ్లిన ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ స్టాఖోవ్స్కీ, వెంటనే తమ దేశాన్ని రక్షించుకోవడానికి తన భార్య -పిల్లలను అక్కడే వదిలేసి చెప్పి దేశం కోసం పోరాడాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు.
అతను ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను రక్షించడంలో సహాయం చేస్తూ ఆర్మీ రిజర్విస్ట్‌లలో సైన్యంతో కలిసి పోరాడుతున్నాడు. టెన్నిస్ స్టార్, సెర్గీ స్టాఖోవ్స్కీ, యుద్ధరంగంలోకి దిగి మరీ తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. కోర్టులో.. యుద్ధభూమిలో కూడా పోరాటానికి సిద్ధమవుతున్నాడు.
ఇప్పటికే స్వదేశం పోరాడటానికి 66వేల మంది ఉక్రేనియన్ పురుషులు వచ్చి తమ దేశభక్తిని పునర్నిర్వచించాచరు. అన్నింటికంటే ఎవరైనా తన దేశం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటే వారి దేశభక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. పురుషులు దేశం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.
ముఖ్యంగా, సానుకూల మార్పును తీసుకురావడం ద్వారా జీవితాన్ని త్యాగం చేయడానికి రెడీ అయ్యారు. ఉక్రెయిన్‌ను నాజీలు నడుపుతున్నారా అనే ప్రశ్నను చాలా మంది వ్యతిరేక వ్యక్తులు ముందుగా లేవనెత్తారు. ఉక్రెయిన్ రష్యా దూకుడుకు వ్యతిరేకంగా తమకు తామే రక్షించుకునే స్వేచ్ఛా -స్వతంత్రం కోసం పోరాడుతున్నారు.
ఇది అత్యంత దేశభక్తిగా కొనియాడుతున్నారు. జాతికి ఇవ్వాల్సిన బాధ్యతలను ఉక్రేనియన్ యువత గుర్తించి యుద్ధంలోకి దిగడాన్ని ఇప్పుడు ప్రపంచం మెచ్చుకుంటోంది. ఇప్పుడు నిజమైన హీరోలను కొనియాడుతోంది. ఇది సంఘం.. సమాజ బాధ్యత అని కొనియాడుతున్నారు. దేశభక్తి చాలా సందర్భాలలో దుర్వినియోగం చేయబడింది. దేశభక్తి అనేది ఒక ఆలోచనా విధానం అని గుర్తుంచుకోవడానికి ఉక్రేనియన్లది గొప్ప ఉదాహరణ.