Begin typing your search above and press return to search.

67 %...తెలంగాణ ఎన్నిక‌ల తుది పోలింగ్ ఇదే

By:  Tupaki Desk   |   7 Dec 2018 5:54 PM GMT
67 %...తెలంగాణ ఎన్నిక‌ల తుది పోలింగ్ ఇదే
X
తెలంగాణలో పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు 67 శాతం పోలింగ్‌ నమోదైందని ఈసీ రజత్‌ కుమార్‌ తెలిపారు. ఇది ఇంకా పెరగొచ్చని.. పోలింగ్ శాతానికి సంబంధించిన పూర్తి సమాచారం రావడానికి సమయం పడుతుందన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 76.5శాతం.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 50శాతం పోలింగ్‌ నమోదైందన్నారు. 13 సమస్యాత్మక ప్రాంతాల్లో 70 శాతం ఓటింగ్‌ నమోదైందన్నారు.

ఓట్ల గల్లంతు పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని.. కొంత మేరకు ఓట్ల గల్లంతు వాస్తవమేన్నారాయన. 'ఓటర్ లిస్టులో పేరు లేని వారు నన్ను క్షమించండి, మరోసారి పొరపాటు జరుగకుండా చూసుకుంటాం' అని రజత్‌ చెప్పారు. ఇక.. 754 ఈవీఎంలను మార్చాల్సి వచ్చిందన్న ఆయన. ఇబ్బందులు తలెత్తడంతో 1,.444 వీవీప్యాట్లను మార్చామని తెలిపారు. ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు రజత్‌కుమార్‌.

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఉదయం ఓటేసేందుకు వెళ్లిన స‌మ‌యంలో ఓటు గల్లంతైన విషయాన్ని అధికారులు చెప్పడంతో ఆమె ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తనతో పాటు తన తండ్రి, సోదరి ఓటు కూడా గల్లంతైందని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తా జ్వాల పేరు ఓటర్ల జాబితాలో గల్లంతైన వ్యవహారంపై ఎన్నిక ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ గుత్తా జ్వాల పేరు 2015 జాబితా నుంచి గల్లంతయిందని వెల్లడించారు. ఆమె పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నుంచి నివేదిక కోరామని వివరించారు. 2019లో కొత్త జాబితా తయారు చేస్తామని స్పష్టం చేశారు.