Begin typing your search above and press return to search.

కొత్త‌గా 6,767.. భార‌త్‌ లో కొన‌సాగుతున్న మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌

By:  Tupaki Desk   |   24 May 2020 7:45 AM GMT
కొత్త‌గా 6,767.. భార‌త్‌ లో కొన‌సాగుతున్న మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌
X
నాలుగో ద‌శ లాక్‌డౌన్ కొన‌సాగుతున్న భారత‌దేశంలో మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభ‌ణ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. తీవ్ర‌స్థాయిలో ఆ వైర‌స్ వ్యాప్తి చెందుతూనే ఉంది. వైరస్‌ పంజా విసురుతూనే ఉంది. పాజిటివ్ కేసుల విష‌యంలో రోజురోజుకు పెంచుకుంటూ రికార్డుస్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,767 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క‌రోజే 147 మంది మృతిచెందారు. ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదవడం.. మృతుల సంఖ్య‌లో కూడా తొలిసారి భారీస్థాయిలో ఉంది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

వీటితో క‌లిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,31,868కి చేరింది. ఇప్పటివరకు 54,440 మంది ఆ వైర‌స్ బారిన ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. మొత్తం మృతులు 3,867. ప్రస్తుతం దేశంలో 73,560 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారంద‌రూ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ వైర‌స్ ప్ర‌ధానంగా కొన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా విస్త‌రిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడులలో ఆ వైర‌స్ విరుచుకుపడుతోంది. మహారాష్ట్రలో 47,190 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వీరిలో 13,404 మంది మాత్ర‌మే కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 1,577 మంది మృతిచెందారు. ఇక‌త తమిళనాడులో 15,512 వైర‌స్ బారిన ప‌డ‌గా, గుజరాత్‌లో 13,664మంది, ఢిల్లీలో 12,910మంది ఆ వైర‌స్ బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తుంటే మ‌రికొన్ని రోజుల్లో ఆ వైర‌స్ తీవ్రంగా దాడి చేసే అవ‌కాశం ఉంది.