Begin typing your search above and press return to search.
షాకింగ్...పుట్ పాత్ పై 69 మంది కరోనా రోగులు
By: Tupaki Desk | 25 April 2020 1:08 PM GMTకరోనాను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించాయి. ఓ వైపు లాక్ డౌన్ అమలవుతున్నా...కరోనా కేసుల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. లోకల్ ట్రాన్స్ మిషన్ దశలోకి భారత్ వెళ్లకుండా ఉండేందుకు వైద్యులు, పారిశుధ్య సిబ్బంది - పోలీసులు - జర్నలిస్టుల - రెవెన్యూ ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే, కొన్ని చోట్ల కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయన్న వాదనలున్నాయి. ఏపీలోని శ్రీకాళహస్తిలో అధికారుల అలసత్వం వల్లే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపణలున్నాయి. ఇటువంటి ఘటనే తాజాగా యూపీలో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ఎట్టావా జిల్లాలోని సాయ్ ఫాయ్ లో 69 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు ఆసుపత్రి బయట గంట పాటు నిలుచున్న ఘటన కలకలం రేపుతోంది. వైద్యులు - వైద్య సిబ్బంది తమను అడ్మిట్ చేసుకోకపోవడంతో 69 మంది కరోనా రోగులు ఉత్తరప్రదేశ్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి గేట్ల వద్ద పడిగాపులు కాసిన వీడియో సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. ఆసుపత్రి వెలుపల ఉన్న ఫుట్ పాత్ పై కనీసం ఒక గంట పాటు వారంతా వేచి చూసిన వైనం అధికారుల నిర్లక్షానికి అద్దం పడుతోంది.
కరోనా సోకిన 69 మందిని ఆగ్రా నుంచి ఓ బస్సులో ఎస్కార్ట్ టీంతోపాటు సాయ్ ఫాయ్ లోని యూపీ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. ఆసుపత్రి గేటు వద్ద ఆ 69 మంది రోగులు కేవలం మొహానికి మాస్క్ మాత్రమే ధరించి పడిగాపులు కాశారు. ప్రొటెక్టివ్ గేర్స్ ధరించిన ఇద్దరు పోలీసులు కొంచెం దూరం నుంచి వీరిని నియంత్రిస్తున్నట్టు వీడియోలో రికార్డయింది. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ ఇన్చార్జి అక్కడకు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి విషయం తెలసుకున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే... ఏర్పాట్లను చేయలేకపోయారని సర్ది చెప్పారు. సమాచార లోపం వల్లే ఇది జరిగిందని యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీసీ అన్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం లేదని, సరైన డాక్యుమెంట్లు లేనప్పటికీ అందరినీ అడ్మిట్ చేసుకున్నామని, ఒక గంట ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇంత సేపు కరోనా పాజిటివ్ పేషెంట్లు బయట ఉండడం...అక్కడ జనసంచారం జరగడంపై విమర్శలు వస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మన దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.