Begin typing your search above and press return to search.

ఆత్మ‌కూరులో 69 శాతం పోలింగ్‌.. గ‌తం కంటే త‌క్కువే!

By:  Tupaki Desk   |   23 Jun 2022 2:29 PM GMT
ఆత్మ‌కూరులో 69 శాతం పోలింగ్‌.. గ‌తం కంటే త‌క్కువే!
X
నెల్లూరు జిల్లాలోని ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన పోలింగ్‌లో సాయంత్రం 7 గంట‌ల స‌మయానికి 69 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్టు పోలింగ్ అధికారులు తెలిపారు.. అయితే.. ఇది గ‌త 2019 ఎన్నిక‌ల్లో న‌మోదైన 74శాతం పోలింగ్‌తో పోలిస్తే.. త‌క్కువేన‌ని చెప్పారు.

ఇక‌,  ఉపఎన్నికలలో చెదురు మదురు సంఘటనలు మినహా మొత్తం మీద ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు.
 
సాయంత్రం 6.00 గంటలకు తుది పోలింగ్ శాతం 65 శాతం న‌మోదైంద‌ని మీనా తెలిపారు.  సాయంత్రం 5.00 గంటలకు 61.70% పోలింగ్ నమోదు అయిందని, మొత్తం మీద 69 % పోలింగ్ నమోదు అయింద‌ని తెలిపారు.

ఉదయం 7.00 గంటలకు మాక్ పోల్ తదుపరి మొత్తం తొమ్మిది (ఒక బి.యు., మూడు సి.యు., ఐదు వివిప్యాడ్) ఇ.వి.ఎమ్.లలో కొద్దిగా సాంకేతిక సమస్య ఏర్పడిందని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించి అన్ని పోలింగ్ స్టేషన్లలో  వెంటనే పోలింగ్ ప్రారంభించడం జరిగిందన్నారు.

ఆత్మకూరులోని ఆంధ్రా ఇంజనీరింగ్ కళశాలలో స్ట్రాంగ్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నిక లు పూర్తయిన తదుపరి ఇ.వి.ఎమ్.లను అన్నింటినీ పటిష్ట  పోలీస్ బందోబస్తు మధ్య భద్రపర‌చ‌నున్న‌ట్టు చెప్పారు. 131 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా ప్రకటించామ‌న్నారు.. ఆయా కేంద్రాల్లో సిసి కెమెరాలు, వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను, సెంట్రల్ పోర్సెస్ ను ఏర్పాటు చేశామ‌న్నారు.

ఇక‌, మండ‌లాల వారీగా.. సాయంత్రం 5.30 గంటల వరకు ఆత్మకూరులో 2.88 శాతం, చేజర్లలో 62.5 శాతం, సంగంలో 65.52 శాతం, ఏఎస్‌ పేటలో 65.75 శాతం, అనంతసాగరంలో 64.68 శాతం, మర్రిపాడులో 63.68 శాతం పోలింగ్‌ నమోదైంద‌ని మీనా వివ‌రించారు.