Begin typing your search above and press return to search.
అతడి ఖాతాలోకి ఏకంగా రూ.6వేల కోట్లు.. ఇంకా వెనక్కి వెళ్లలేదట
By: Tupaki Desk | 9 Aug 2022 1:30 PM GMTఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.6వేలకోట్లు. మరింత పక్కాగా చెప్పాలంటే రూ.6833.42 కోట్ల భారీ మొత్తం ఒక సామాన్యుడి అకౌంట్లో జమైంది. దీంతో అతడికి నోట మాట రాలేదు.
బిహార్ లోని ఒక సాదాసీదా వ్యక్తి అయిన సుమన్ కుమార్ డీ మ్యాట్ ఖాతాలోకి ఇంత భారీ మొత్తం డిపాజిట్ కావటంతో అతనికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బిహార్ లోని లఖీసరాయ్ జిల్లా బర్షియాకు చెందిన అతడికి కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్ అకౌంట్ ఉంది.
వారం క్రితం రూ.6వేల కోట్లకు పైనే డీమ్యాట్ అకౌంట్లో జమ అయ్యింది. అకౌంట్ ను తనిఖీ చేసుకోవటంలో భాగంగా చూసిన అతడు..ఈ భారీమొత్తాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
అయితే.. బ్యాంకు అధికారుల పొరపాటు కారణంగా ఇంత భారీ మొత్తం తన ఖాతాలోకి జమ అయి ఉంటుందని భావించారు. చూస్తుండగానే వారం రోజులు గడిచిపోవటం.. తన అకౌంట్లో పడిన భారీ మొత్తం ఇప్పటికి అలానే ఉండటంతో షాక్ తిన్న అతను.. మీడియా ముందుకు వచ్చారు.
అదే సమయంలో తన అకౌంట్లో ఇంత భారీ మొత్తం జమ అయిన తర్వాత కూడా పోలీసుల్ని కూడా ఎవరూ సంప్రదించకపోవటం ఏమిటన్నది అతగాడి ప్రశ్న.
అయితే.. ఈ ఉదంతానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సూర్యగఢ పోలీస్ స్టేషన్ సీఐ పేర్కొన్నారు. మొత్తానికి ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.