Begin typing your search above and press return to search.

కల్తీ మద్యంతో బెజవాడలో ఏడుగురు బలి

By:  Tupaki Desk   |   7 Dec 2015 8:52 AM GMT
కల్తీ మద్యంతో బెజవాడలో ఏడుగురు బలి
X
ఏపీలో దారుణం జరిగింది. కల్తీ మద్యం తాగిన ఏడుగురు మృత్యువాత పడగా.. పదుల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలోని స్థానిక కృష్ణ లంక నెహ్రూ నగర్ లో స్వర్ణ బార్ లో అమ్మిన కల్తీ మద్యం కారణంగా పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. అస్వస్థతకు గురైన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోవటంతో బాధితుల కుటుంబ సభ్యులు.. బంధువులు స్వర్ణ బార్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు జన చైతన్య యాత్రలో భాగంగా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. ఈ ఘటనపై వెనువెంటనే న్యాయవిచారణకు ఆదేశాలు జారీ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలన్నారు.

మరోవైపు.. బాధితులకు సాయం అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. బాధితులకు అవసరమైన వైద్యసాయం అందిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అయినా.. ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన బార్ లో కల్తీ మద్యం ఎలా వచ్చింది? ఇంత మంది మరణానికి కారణం ఏమిటి? దీని వెనుక ఎవరున్నారు? అన్న అంశాలపై ఏపీ సర్కారు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.