Begin typing your search above and press return to search.

ప్యాసింజర్లను వదిలేసి వెళ్లిపోయిన ఫ్లైట్

By:  Tupaki Desk   |   24 Jan 2016 5:05 AM GMT
ప్యాసింజర్లను వదిలేసి వెళ్లిపోయిన ఫ్లైట్
X
ప్యాసింజర్లు విమానంలోకి ఎక్కారు. ఫ్లైట్ వెళ్లటానికి అంతా సిద్దమైంది. అప్పుడే చిన్న ఇష్యూ మీద లొల్లి మొదలైంది. అదెంత పెద్దదిగా మారిందంటే.. ప్యాసింజర్లను వదిలేసి సదరు ఫ్లైట్ వెళ్లిపోయింది. తమను విమానం నుంచి దింపేసి ఫ్లైట్ వెళ్లిపోవటంతో ప్యాసింజర్లకు మంట పుట్టింది. సదరు విమానయాన సంస్థ సిబ్బంది తీరుపై ప్యాసింజర్లు కారాలు మిరియాలు నూరారు. ఇంతకీ సదరు విమాన సంస్థ ఏది? ప్యాసింజర్లను వదిలేసి ఫ్లైట్ ఎందుకు వెళ్లిపోయింది? మరి..ఈ పంచాయితీని ఎలా సెట్ చేశారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చూస్తే..

సింఫుల్ గా తేల్చేసే చిన్న అంశం కాస్తా.. ఇండిగో సిబ్బంది మొండితనం పెద్ద గొడవగా మారిందని చెప్పొచ్చు. హైదరాబాద్ లోని జరిగిన ఒక విందుకు ఛత్తీస్ గఢ్ కు చెందిన 70 మంది బంధువులు హైదరాబాద్ కు వచ్చారు. తిరిగి వెళ్లేందుకు వారు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన విమానంలో టిక్కెట్లు బుక్ చేశారు. ఈ బృందం విమానం వచ్చాక సీట్లలో కూర్చున్నారు.

అయితే.. మొత్తం ఒకే ఫ్యామిలీ కావటంతో ఈ 70 మంది తమకు కేటాయించిన 70 సీట్లలో తమకు నచ్చిన చోట కూర్చున్నారు. ఇలా కూర్చోవటం ఇండిగో సిబ్బందికి నచ్చలేదు. టిక్కెట్లు బుక్ చేసిన తీరులోనే కూర్చోవాలన్నది ఇండిగో సిబ్బంది వాదన. మా సీట్లలో మేం కూర్చున్నాం.. మీకేం ఇబ్బందన్నది సదరు ఫ్యామిలీ వాదన. ఇలా మాటలు కాస్తా రూల్స్ వరకూ వెళ్లాయి.

అంతే.. 70 మంది ప్యాసింజర్లను వదిలేసి విమానం టేకాఫ్ తీసుకుంది. దీంతో.. 70 మందికి ఒళ్లు మండిపోయింది. విమానయాన సంస్థ తీరుపై ఆందోళన చేపట్టారు. విషయం పోలీసుల వరకూ వెళ్లింది. వారు ఎంట్రీ ఇచ్చి విషయం తెలుసుకొని.. రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చి.. చివరకు సదరు విమానయాన సంస్థ వేర్వేరు ఫ్లైట్ లలో ఈ 70 మందిని తిరిగి తీసుకెళ్లేందుకు ఓకే చెప్పటంతో వివాదం ముగిసింది. కాకుంటే అనుకున్న సమయానికి కాకుండా.. పక్కరోజున వారిని ఛత్తీస్ గఢ్ తీసుకెళ్లారు. అప్పటివరకూ ఒక హోటల్లో వసతి కల్పించారు. ఇండిగో సిబ్బంది యవ్వారం చూస్తే.. సింఫుల్ గా తేల్చేసే ఇష్యూకి మరీ ఇంత లొల్లి అవసరమా అనిపించక మానదు.