Begin typing your search above and press return to search.

ఒలింపిక్ పతకధారి సింధూకు 70 ఏళ్ల వ్యక్తి ప్రేమ లేఖ..

By:  Tupaki Desk   |   20 Aug 2022 11:00 AM GMT
ఒలింపిక్ పతకధారి సింధూకు 70 ఏళ్ల వ్యక్తి ప్రేమ లేఖ..
X
పూసర్ల వెంకట సింధూ (పీవీ సింధూ) తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు.. దేశంలోనూ అందరికీ తెలిసిన పేరు.. బ్యాడ్మింటన్ లో ప్రస్తుతం దేశంలో నంబర్ వన్ మహిళా ప్లేయర్. పురుషుల్లోనూ ఆమె స్థాయిలో రాణిస్తున్న, ప్రతిభ ఉన్న ఆటగాళ్లు లేరు. ఇటీవల బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లోనూ సింధూ గోల్డ్ మెడల్ సాధించి దేశ ప్రతిష్ఠ పెంచారు. వాస్తవానికి పీవీ సింధూ కెరీర్ బయోపిక్ కు ఏమాత్రం తీసిపోదు. అయితే, అది ఇప్పుడే కాదు.. మరికొన్నాళ్లు అయితే కచ్చితంగా వస్తుంది. ప్రస్తుతం సింధూ వయసు 27 ఏళ్లే. కనీసం రెండు ఒలింపిక్స్ ఆడే సమయం, సామర్థ్యం, సత్తా ఆమెలో ఉన్నాయి. తాజా ఫామ్ ప్రకారం చూస్తూ సింధూను బ్యాడ్మింటన్ కోర్టులో ఎదుర్కొనాలంటే ప్రత్యర్థి ఎవరైనా ఒకటికి రెండు సార్లు కసరత్తులు చేయాల్సిందే.

రెండు ఒలింపిక్, మూడు కామన్వెల్త్ పతకాలు సింధూ అంతర్జాతీయ కెరీర్ 2013 నుంచి ప్రారంభమైంది. ఈ పదేళ్లలో ఆమె అనేక జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించింది. 2013లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్ లో సింధూ తొలిసారిగా టైటిల్ కొట్టింది.

మరుసటి ఏడాది కూడా ఈ టైటిల్ నెగ్గిన ఆమె.. మధ్యలో రెండేళ్లు గ్యాప్ వచ్చినా, 2017 నుంచి మాత్రం హ్యాట్రిక్ సాధించింది. ఇక 2016 ఒలింపిక్స్ లో సింధూ రజతం సాధించి దేశానికి గౌరవ ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. 2020 ఒలింపిక్స్ లో కాంస్యంతో సరిపెట్టుకున్నా చరిత్రలో నిలిచింది. 2018 ఆసియా క్రీడల్లో రజతం, 2014, 2022 ఆసియన్ చాంపియన్ షిప్స్ లో కాంస్యాలు, 2014, 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం, వరుసగా కాంస్యం, రజతం, స్వర్ణంతో భారతావని మురిసేలా చేసింది.

మోస్ట్ ఫేమస్ స్సోర్ట్స్ పర్సన్ సింధూ వాణిజ్య ప్రకటనలు, పారితోషికాలు, కాంట్రాక్టులు ఇతరత్రా ఏమైనా కానీ.. దేశంలో క్రికెటర్లు కాక ప్రస్తుతం అత్యంత విలువైన క్రీడాకారిణి ఆమెనే. దీంతోపాటు యూత్ ఐకాన్ కూడా సింధూనే. కాగా.. సింధూ వాణిజ్య ప్రకటనల విలువ రూ.కోట్లలోనే ఉంటుంది. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో సింధూ స్థాయి మరింత పెరిగింది. ఆమె రెండేళ్లలో జరుగనున్న ఒలింపిక్స్ లోనూ
పతకం తెచ్చే అవకాశాలున్నాయి. కాగా, సింధూ తాజాగా ఓ ప్రముఖ చానల్ కు ఇంటర్వ్యూకు వెళ్లారు. అందులో చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఇష్టమైన హీరో నుంచి అన్ని విషయాలు ప్రముఖ సినీ నటుడు నిర్వహిస్తున్న ఈ టాక్ షోలో సింధూ తనకు ఇష్టమైన హీరో ప్రభాస్ అని చెప్పింది. క్రీడాకారిణి అవడంతో వ్యక్తిగత జీవితాన్ని మిస్ అవుతున్నట్లు ఫీల్ కావడం లేదని.. మిగతావారి కంటే తానే ఎక్కువ టూర్లు చేస్తుంటానని సింధూ వివరించింది. ఇక ఆమెకు ఓ 70 ఏళ్ల వ్యక్తి నుంచి లవ్ లెటర్ వచ్చిందని పెళ్లి చేసుకోవాలంటూ అతడు ఒత్తిడి చేశాడని.. లేదంటే డ్నాప్ చేస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని చెప్పిన సింధూ.. ఇంకా ఎన్నో వ్యక్తిగత వివరాలను కూడా పంచుకుంది.

సింధూలో మంచి హ్యూమర్ కూడా ఉంది ఈ టాక్ షో ద్వారా తేలిందేమంటే.. సింధూలో మంచి హ్యూమర్ ఉంది. ఆమె వేసిన పంచ్ లు అందరినీ నవ్వించాయి. అంతేకాక.. తనకు వచ్చిన లవ్ లెటర్లను ఇంట్లోని అందరం చదువుతామని చెప్పి ఆశ్చర్యపరిచింది. ఓ క్రీడాకారిణిగా తాను కోర్టులో ఎదుర్కొనే ఒత్తిడిలో ఏం చేస్తానో వివరించింది. మాజీ క్రికెటర్, క్రీడా ప్రముఖుడు చాముండేశ్వరినాథ్ కార్లు ఇస్తూ ప్రోత్సహిస్తారని.. కానీ, ఆయన ఊరు తెలియదని చెప్పి నవ్వించింది. తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన గోపీచంద్ క్రీడా అకాడమీని వదిలివేయడానికి కారణాలను కూడా చెప్పిన సింధూ మరింత ఉత్కంఠ రేకెత్తించింది.