Begin typing your search above and press return to search.

ఇంజినీరింగ్ చ‌దివాం..మాకు పాకీ ప‌ని ఇస్తారా?

By:  Tupaki Desk   |   1 Dec 2019 6:08 AM GMT
ఇంజినీరింగ్ చ‌దివాం..మాకు పాకీ ప‌ని ఇస్తారా?
X
`ఏంటి నిజంగా అలా అడిగారా? ఇంజినీరింగ్ చ‌దివిని వారు ...మాకు పాకీప‌ని ఇస్తారా? అంటూ ఎక్క‌డైనా అడుగుతారా? అలా అడిగితే..ఎంత దారుణ‌మైన దుస్థితిలో మ‌నం ఉన్న‌ట్లు? ఇంత‌కీ...ఎక్క‌డ జ‌రిగింది ఈ ఘ‌ట‌న‌?`` పై హెడింగ్ చూసి మీకు వ‌చ్చిన సందేహాలు - ప్ర‌శ్న‌లు ఇవే క‌దా? ఈ దారుణ‌మైన ఘ‌ట‌న మ‌రెక్క‌డో జ‌ర‌గ‌లేదు. మ‌న ప‌క్క‌రాష్ట్రమైన త‌మిళ‌నాడులోనే జ‌రిగింది. తమిళనాడు కోయంబత్తూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో 549 శానిటరీ వర్కర్ల పోస్టులకు భారీ ఎత్తున ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అలా వ‌చ్చిన వాటిలో 7 వేల మంది ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ - గ్రాడ్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసుకున్న వారే అని అధికారులు ప్ర‌క‌టించ‌డంతో...అనేక‌మంది విస్తుపోయారు.

కోయంబత్తూర్ నగర మున్సిపల్ కార్పొరేషన్‌ లో ఖాళీగా ఉన్న 549 పారిశుద్ధ్య కార్మికుల పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఈ పోస్టులకు ఇంజినీరింగ్ చదివిన 7వేల మంది గ్రాడ్యుయేట్లు సైతం దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది ఇప్పటికే ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న వారూ ఉన్నారు. గవర్నమెంట్‌ జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుర‌క్షిత‌మ‌ని భావించి ఈ కొలువుకు అప్లై చేసుకున్నట్లు పలువురు చెప్పారు. అధికారులు బుధ‌వారం నుంచి మూడురోజుల పాటు వారికి ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించారు. బీఈ చదివిని అరుణ్ కుమార్ అనే నిరుద్యోగి ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ‘నేను ఎల‌క్ట్రానిక్స్‌ లో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. కాని నాకు ఎలాంటి ఉద్యోగం దొరకలేదు. అందుకే నేను పారిశుద్ధ్య కార్మికుడి పోస్టు కోసం దరఖాస్తు చేశాను’’ అని వెల్ల‌డించాడు. కాగా - బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన పూవిజి మీనా - ఎంకామ్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె భర్త ఎస్ రాహుల్ సైతం ఇంట‌ర్వ్యూకు వ‌చ్చారు. ఇంటర్వ్యూలో ఎంపికైతే తాము శానిటరీ కార్మికులుగా పనిచేయడానికి అభ్యంతరం లేదని ఈ జంట తెలిపింది.

ఈ శానీట‌రీ ఉద్యోగాలకు కనీస విద్యార్హత 10వ తరగతి. ప్రారంభ జీతం రూ .15,700. పొద్దున మూడు గంటలు - సాయంత్రం మూడు గంటలు పని గంటలు. ఈ మధ్యలో ఉన్న విశ్రాంతి సమయంలో ఇతర చిన్న పనులు చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఇదే ఉద్యోగార్థులను ఆకర్షించినట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల‌తో పాటుగా గత పదేళ్లుగా కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులుగా పనిచేస్తున్న వారు కూడా ఈ శాశ్వత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.