Begin typing your search above and press return to search.
ట్రంప్ కు షాక్..మనోళ్లు 7000 మంది సేఫ్
By: Tupaki Desk | 20 Jan 2018 5:29 PM GMTశరణార్థులు....అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అస్సలు నచ్చని పదం. వలసదారులనయినా... డ్రీమర్స్ పేరుతో అమెరికా చట్టం ప్రకారం అనుమతితో చిన్నతనంలో తల్లిదండ్రుల వెంట వచ్చిన వారయిన పేరు ప్రస్తావించగానే ట్రంప్ నిప్పులు చెరుగుతుంటారు. అయితే ఇదే విషయంలో ట్రంప్ సర్కార్ కు తాజాగా చట్టసభలో చుక్కెదురైంది. ద్రవ్య వినిమయ బిల్లుకు నో చెప్పడం..తద్వారా దేవంలో అధికారిక కార్యకలాపాలు స్తంభించడం తెలిసిన సంగతే. అయితే ఈ నిర్ణయం వల్ల దాదాపు 7000 మంది ఇండియన్ అమెరికన్లతో సహా మొత్తం 8,00,000 మంది భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం తప్పింది. ఇమ్మిగ్రేషన్ (వలసల) విధానం పరిష్కారమైతే తప్ప ప్రభుత్వానికి మద్దతు ఇవ్వరాదని పలువురు డెమోక్రట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వెనక్కు తగ్గవచ్చని అంటున్నారు.
సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చినవారి పిల్లల రక్షణ కోసం 2012లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా డాకా (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్) డ్రీమర్ స్కీమ్ ని ప్రవేశపెట్టారు. ఈస్కీమ్ ప్రకారం...30 ఏళ్ల లోబడిన వారంతా తమ వ్యక్తిగత సమాచారాన్ని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీకి అందజేయాలి. ప్రతీ రెండేళ్లకు ఒకసారి వ్యక్తిగత సమాచారాన్ని అధికారులు సేకరించి పరిశీలిస్తారు. ఒబామా ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ని రద్దు చేయనున్నట్టు గతేడాది సెప్టెంబర్ లో ట్రంప్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి5 నుంచి డాకా డ్రీమర్ స్కీమ్ లో పేర్లు నమోదు చేసుకున్నవారి దరఖాస్తులను రెన్యువల్ చేయబోమని, కొత్త దరఖాస్తులను స్వీకరించమని అధికారులు ప్రకటించారు.
అయితే డాకా డ్రీమర్ స్కీమ్ ని ప్రభుత్వం కొనసాగించేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థిస్తూ పలువురు బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈకేసును విచారించిన యూఎస్ కోర్టు డాకా డ్రీమర్ స్కీమ్ ఎత్తివేతపై స్టే ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఇమ్మిగ్రెంట్స్‌ను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని శాన్‌ఫ్రాన్సిస్కో న్యాయమూర్తి విలియమ్ అల్ సప్ ట్రంప్ సర్కార్‌ను ఆదేశించారు. దీనికొ కొనసాగింపుగా తాజాగా డెమోక్రాట్లు పట్టుబట్టడం వల్ల 8లక్షల మంది ఇబ్బందులు పడటం తప్పవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు.
కాగా, మరోవైపు ట్రంప్ నిర్ణయం క్రూరమైందని, ఇది స్వయంగా ఓటమిని అంగీకరించడమే అవుతుందని తాజా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. డ్రీమర్స్ ఆశలు గల్లంతు చేస్తూ ఫైలుపై ట్రంప్ సంతకం చేసిన రోజే ట్రంప్ చర్యను ఒబామా తప్పుపట్టారు. వలసదారుల వల్ల అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదమే మీలేదని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరంలేదని తన ఫేస్ బుక్ ఖాతాలో ఒబామా పేర్కొన్నారు. సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్ వర్క్ పర్మిట్లను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేయడాన్ని క్రూరమైన నిర్ణయమని విమర్శించారు.పేరెంట్స్ అమెరికాకు రావడమే డ్రీమర్స్ చేసిన తప్పిదం కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే యువతపై ఆంక్షలు విధించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు.
మరోవైపు దీనిపై ఇప్పటికే పలు సాఫ్ట్ వేర్ కంపెనీల సీఈఓలు కూడా తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్స్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ళ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.