Begin typing your search above and press return to search.
ఐఐటీ విద్యార్థులైతే మాత్రం స్నానం చేయరా?
By: Tupaki Desk | 1 Sep 2016 8:50 AM GMTరోజూకి రెండు సార్లు - సమ్మర్ లో అయితే అంతకుమించి.. కాదు కూడదు అంటే కనీసం రోజుకి ఒక్కసారి స్నానం చేయనివారుంటారా అంటే.. ఉండరని చెప్పేవారే ఎక్కువ. అయితే ఈ విషయంలో మాత్రం ఐఐటీ విద్యార్థులు ఏమాత్రం ఆసక్తి చూపడంలేదట. చదువు ముఖ్యం - స్నానం కాదు అని స్టేట్ మెంట్స్ రాసుకుంటున్నారో లేక స్నానం చేసే సమయం కూడా వృథాచేయకూడదని భావిస్తున్నారో.. కారణాలు మాత్రం తెలియలేదు కానీ.. ఐఐటీ బాంబే విద్యార్థులలో ప్రతి పదిమందిలో ఆరుగురు వారంలో రెండు లేదా మూడుసార్లు మాత్రమే స్నానం చేస్తారట. మరికొంతమంది అయితే...వారానికి ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తారట. అంతా అదే బాపతు అనుకునేరు.. ప్రతిరోజూ స్నానాలు చేసేవాళ్లు కూడా ఉన్నారనుకోండి.. కాకపోతే వారు కేవలం 30శాతం మాత్రమే!
స్వయంగా బాంబే ఐఐటీ విద్యార్థులే నిర్వహించిన ఓ సర్వేలో ఇలాంటి ఎన్నో విషయాలన్నీ బయటపడ్డాయి. ఐఐటీ బాంబే లో చదువు పూర్తిచేసి బయటకు వెళ్లిన 332 మంది అభ్యర్థుల నుంచి ఈ తరహా ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఐఐటీ చదువుకునే రోజుల్లోనే స్నేహితులతో గోవా వెళ్లినవారు 52.4 శాతం మంది ఉంటే.. 55.7 శాతం మంది ఏదో ఒకరకమైన జూదం ఆడారట. ఇదే సమయంలో లోకల్ ట్రైన్స్ లో టిక్కెట్లు లేకుండా ప్రయాణించడంలో కూడా వీరు 70%వరకూ ఉన్నారట. ఇదేమి దారుణంరా బాబోయ్ అనుకునేరు... ఇంకా చాలానే ఉంది.
ఇక హాస్టల్ లైఫ్ - ఇంటికివెళ్లిపోవడం వంటి విషయాలపై కూడా ఈ సర్వే వివరాలు రాబట్టింది. ఈ విషయంలో 40 శాతం మంది హాస్టళ్లలో తమ రూమ్మేట్లతో మరికొంత కాలం కలిసుంటే బాగుంటుందని భావిస్తుంటే, 27 శాతం మంది మాత్రం సొంత ఇళ్లకు వెళ్లిపోవాలని అనుకుంటున్నారట. మరో విషయం ఏమిటంటే... తమ చిన్ననాటి స్నేహితులతో సంబంధాల విషయంలో 66 శాతం మంది చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెబితే.. 29.8 శాతం మంది మాత్రం తమ తల్లిదండ్రులతో కూడా అంతంతమాత్రంగానే మాట్లాడుతున్నారట.
ఇక పెళ్లి, పిల్లల విషయంలో కూడా వీలైనంత ఆలస్యాన్ని పాటిస్తున్న వారిలో వీరుకూడా చేరిపోవాలని అనుకుంటున్నట్లు.. మరో ఐదేళ్ల వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని 31 శాతం మంది చెబితే, 21.4 శాతం మంది మూడు నుంచి ఐదేళ్ల మధ్యలో పేళ్లి చేసుకుంటామన్నారట. రొటీన్ కి భిన్నంగా ఆలోచించడం అంటే ఇదేనేమో అని ఈ సర్వే వివరాలు తెలుసుకున్నవారు స్పందిస్తున్నారు.