Begin typing your search above and press return to search.

పాతికేళ్ల‌లో అమెరికాలో అతి పెద్ద భూకంపం ఇదేన‌ట‌!

By:  Tupaki Desk   |   7 July 2019 5:25 AM GMT
పాతికేళ్ల‌లో అమెరికాలో అతి పెద్ద భూకంపం ఇదేన‌ట‌!
X
అమెరికాకు సంబంధించి చోటు చేసుకునే ఏ ఉదంతానికైనా భార‌త మీడియాలో అత్య‌ధిక ప్రాధాన్య‌త ల‌భిస్తుంది. నేరాలు.. ఘోరాల‌తో పాటు కొన్ని విష‌యాల‌కు ద‌క్కే ప్ర‌యారిటి.. అమెరికాలోని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల మీదా మాత్రం పెద్ద‌గా ఫోక‌స్ కాదు. తాజాగా అమెరికాలో భూకంపం చోటు చేసుకుంది. గ‌డిచిన పాతికేళ్ల‌లో ఇదే పెద్ద‌ద‌ని చెబుతున్నారు. ఈ నెల మూడు నుంచి ఆరు వ‌ర‌కు వివిధ సంద‌ర్భాల్లో భూకంపం చోటు చేసుకుంది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్ మీద 7.1గా చెబుతున్నారు. తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్నా.. మ‌ర‌ణాలు ఏమీ లేక‌పోవటంతో మీడియాలో దానికి పెద్ద ప్రాధాన్యం త‌గ్గ‌లేదు. కాకుంటే.. అమెరికాతో సంబంధాలు ముడివేసుకొని ఉన్న భార‌తీయులు.. మ‌రి ముఖ్యంగా తెలుగు వారు మాత్రం తీవ్ర‌మైన ఆందోళ‌న‌కు గురి అవుతున్నారు.

అమెరికాకు సంబంధించి ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ విన‌ని భూకంపం వార్త వారిని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. అమెరికాలోని ద‌క్షిణ కాలిఫోర్నియాలో చోటు చేసుకున్న తాజాగా భూకంప తీవ్ర‌త 7.1గా గుర్తించారు. భూకంప కేంద్రం లాస్ ఏంజెల్స్ ప‌ట్ట‌ణానికి ఈశాన్యంలో 320 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ట్లుగా అంచ‌నా వేస్తున్నారు. తాజా భూకంపం కార‌ణంగా భ‌వ‌నాలు కంపించాయి. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం చోటు చేసుకుంది. మౌలిక స‌దుపాయాల సంబంధ‌మైన న‌ష్టం అంత‌గా సంభ‌వించ‌లేదు.

గ‌డిచిన రెండు ద‌శాబ్దాల్లో ఇదే అతి పెద్ద భూకంపంగా చెబుతున్నారు. ఒక్క‌సారిగా భూమి కంపించ‌టంతో అక్క‌డి స్థానికుల‌కు కొన్ని క్ష‌ణాలు ఏమీ అర్థం కాలేదు. ఆ వెంట‌నే భూకంపాన్ని గుర్తించిన వారు ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. భూకంపం కార‌ణంగా మృత్యువాత ప‌డిన వారు పెద్ద‌గా లేన‌ప్ప‌టికీ ఇళ్ల పునాదుల‌కు ప‌గుళ్లి ఇవ్వ‌టం.. అడ్డ‌గోడ‌లు కుంగిపోవ‌టం.. ఆస్తిన‌ష్టం భారీగా చోటు చేసుకున్న‌ట్ఉల‌గా చెప్పాలి.

లాస్ ఏంజెల్స్ కు 240 కిలోమీట‌ర్ల దూరంలో రిడ్జ్ క్రెస్ట్ అనే చిన్న న‌గ‌రం తాజా భూకంకం ధాటికి వ‌ణికింది. ఇక్క‌డ ఒక మోట‌ల్ ను నిర్వ‌హిస్తోంది భార‌తీయ కుటుంబం. తాజా భూకంపం మీద వారు మాట్లాడుతూ.. తాము బ‌తుకుతామ‌ని అస్స‌లు అనుకోలేద‌న్నారు. ఈ మోట‌ల్ పైక‌ప్పు కూలి హోట‌ల్ య‌జమానుల మీదా.. అతిధుల మీద ప‌డ‌టంతో ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఆస్తిన‌ష్టం.. ప్రాణ న‌ష్టం వివ‌రాలు రాలేదు.

తాజాగా చోటు చేసుకున్న భూకంపం మాదిరి రానున్న రోజుల్లో మ‌రిన్ని భూకంపాలు వ‌చ్చే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న మాట‌ను అధికారులు చెబుతున్నారు. భూకంపం కార‌ణంగా కొన్ని భ‌వ‌నాలు కూలిపోయాయి. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. ప‌లు చోట్ల అగ్నిప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. వైట్ హౌస్ నుంచి సాయం కావాల‌ని కాలిఫోర్నియా గ‌వ‌ర్న‌ర్ గ‌విన్ న్యూస‌మ్ కోరారు. ఏమైనా తాజా భూకంపం అమెరిక‌న్ల‌లో కొత్త భ‌యాన్ని తీసుకొచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.