Begin typing your search above and press return to search.

క‌రోనా అప్డేట్‌: ‌కొత్త‌గా 71 పాజిటివ్‌ - ఏపీలో మొత్తం కేసులు 1,403

By:  Tupaki Desk   |   30 April 2020 6:50 AM GMT
క‌రోనా అప్డేట్‌: ‌కొత్త‌గా 71 పాజిటివ్‌ - ఏపీలో మొత్తం కేసులు 1,403
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కరోనా ఇంకా తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 71 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా క‌ట్ట‌డికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నా క‌రోనా మాత్రం అదుపులోకి రావ‌డం లేదు. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో క‌రోనా కేసులు 1,403కు చేరాయి. విస్తృతంగా ప‌రీక్ష‌లు చేస్తుండ‌డంతో కేసులు భారీగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా 71 కేసులు వెలుగుచూడ‌గా 34మంది డిశ్చార్జ‌య్యారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 321కి చేరింది. 1,051 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా వారంతా ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని వైద్యారోగ్య శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 24 గంట‌ల్లో 6,497 న‌మూనాలు ప‌రీక్షించిన‌ట్లు వెల్ల‌డించింది.

కొత్త‌గా డిశ్చా‌ర్జైన వారిలో గుంటూరు జిల్లా నుంచి 28 - అనంత‌పుర‌ము ముగ్గురు - తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి ఇద్ద‌రు - విశాఖ‌ప‌ట్ట‌ణం నుంచి ఒక‌రు ఉన్నారు. క‌రోనా కేసుల్లో టాప్‌ లో క‌ర్నూలు - గుంటూరు జిల్లాలు ఉండ‌గా - అత్య‌ల్పంగా కేసులు న‌మోదైన జిల్లా శ్రీకాకుళం. క‌రోనా ర‌హిత జిల్లాగా విజ‌య‌న‌గ‌రం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ జిల్లాలో ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాని విష‌యం తెలిసిందే.

అయితే క‌రోనా సోకిన ప్రాంతాల‌ను కంటైన్‌ మెంట్ కేంద్రాలుగా ప్ర‌క‌టించి అక్క‌డ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇత‌రుల‌కు సోక‌కుండా క‌రోనా చెయిన్‌ ను తెంపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. లాక్‌ డౌన్ ముగిసేలోపు రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డి కావాల‌ని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు. అందుక‌నుగుణంగా ప‌క్కాగా అధికార యంత్రాంగం చ‌ర్య‌లు తీసుకుంటూ కొంత ప‌రిస్థితిని అదుపులోకి తీసుకు వ‌స్తున్నారు.