Begin typing your search above and press return to search.
లేచిపోయిన భార్య..భర్తకు 71 గొర్రెల నష్టపరిహారం
By: Tupaki Desk | 18 Aug 2019 11:27 AM GMTవివాహేతర సంబంధం పెట్టుకొని భార్య వేరే వ్యక్తితో పారిపోయింది. మామూలుగా భగ్న భర్తలు ఏం చేస్తారు.. పెళ్లాన్ని చీకొడతారు.. చీత్కరిస్తారు.. కోపోద్రిక్తులైన కొందరు ప్రతీకారంతో భార్యను, ఆయె ప్రియుడిని ఆవేశంలో హత్యలు చేసిన సందర్భాలు మన కళ్లముందు ఉన్నాయి.. కానీ ఈ యూపీ మొగుడేంట్రా బాబు.. పెళ్లానికి బదులు 71 గొర్రెలు తీసుకున్నాడు. ఉత్తర భారతంలో చోటుచేసుకున్న ఈ ఘటన చూసి ఇప్పుడు నవ్వాలో ఏడ్వాలో అర్థం కానీ పరిస్థితి నెలకొంది.
ఉత్తరప్రదేశ్ లో ఎన్నో దారుణాలు జరుగుతుంటాయి. మూఢవిశ్వాసాలు - కక్షలు - కార్పణ్యాలు - మతకల్లోలాలు కామన్. అయితే తాజాగా యూపీలోని గోరఖ్ పూర్ జిల్లాలో ఓ వింత గొడవ అక్కడి మీడియా పతాక శీర్షికన వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. గోరఖ్ పూర్ జిల్లాని చార్ఫాణి గ్రామం అదీ.. అక్కడ రాజేష్ పాల్-సీమాపాల్ (25) అనే భార్య భర్తలు నివసిస్తుంటారు. సీమాపాల్ కు ఉమేష్ (27) అనే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం గ్రామంలో బయటపడి భర్తకు తెలిసింది. దీంతో ప్రియుడితో కలిసి భార్య సీమాపాల్ పారిపోయింది. ఆ తర్వాత కొద్దిరోజులకు తిరిగొచ్చారు. సీమా అత్తామామ - భర్తలు ఈ విషయంపై గ్రామంలో పంచాయతీ పెట్టారు. భర్తతో కలిసి ఉండనని సీమా ససేమిరా అంది. ఉమేష్ తోనే ఉంటానంది. దీంతో గ్రామ పెద్దలు ఆ ప్రియుడికి శిక్ష విధించారు. భర్త రాజేష్ పాల్ కు ప్రియుడు ఉమేష్ తన గొర్రెలు 142లో సగం 71 గొర్రెలు నష్టపరిహారంగా ఇవ్వాలని తీర్పునిచ్చారు.. సీమా కోసం ప్రియుడు ఈ గొర్రెలు ఇవ్వడానికి రెడీ అన్నాడు..
అయితే ఈ గొర్రెలను కాస్తున్న ప్రియుడు ఉమేష్ తండ్రి ఒప్పుకోలేదు. మనం నష్టపరిహారం ఇవ్వడం ఏంటనే పోలీస్ స్టేషన్ గడుప తొక్కాడు. దీంతో విషయం వెలుగు చూసింది. పక్కవ్యక్తి భార్యను తెచ్చుకోవడానికి ప్రియుడు నష్టపరిహారం ఇవ్వడమే ఒక వింత.. ఇక ఆ భర్త తీసుకోవడం పెద్ద వింతై కూర్చుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.