Begin typing your search above and press return to search.
భారతదేశంలో ఒక్కరోజే 7466 కేసులు
By: Tupaki Desk | 29 May 2020 3:30 AM GMTసడలింపుల తర్వాత తెలంగాణ మహమ్మారి కేసులు బాగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణలో 117 కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా కేసులు 100 దాటుతుండడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా 4 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో మొత్తం తెలంగాణలో కేసుల సంఖ్య 2256కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 67కు చేరింది..
కొత్తగా వచ్చిన 117 కేసుల్లో 66 మంది తెలంగాణకు చెందిన వారని.. ఇద్దరు వలసదారులని.. 49మంది సౌదీ అరేబియా నుంచి వచ్చిన వచ్చిన వారని తెలిపారు.
*ఏపీలో 3245కు కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్త 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2841కి చేరింది. 1958మంది ఇప్పటిదాకా డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటిదాకా 59మంది మరణించారు. 824మంది ఇప్పటిదాకా చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో నెల్లూరులో 2, గుంటూరులో 1, చిత్తూరులో 1, కోయంబేడు (తమిళనాడు) నుంచి మొత్తం 4 మంది వచ్చారు.
*భారతదేశంలో ఒక్కరోజే 7466 కేసులు
భారత్‌పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,65,799కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కాగా, దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 71,105 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 4,706 మంది మృతిచెందారు. ప్రస్తుతం 89,987 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో, గుజరాత్‌లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది.