Begin typing your search above and press return to search.
మర్కజ్ ఎపిసోడ్ తో కేసీఆర్ డ్రీమ్స్ మొత్తం ధ్వంసం!
By: Tupaki Desk | 4 April 2020 4:45 AM GMTజస్ట్ మాటలతో ఎదుటోళ్లలో అంతులేని విశ్వాసం తీసుకురావటం అంత తేలికైన విషయం కాదు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టాలెంట్ ను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచాన్ని వణికించిన కరోనా విషయంలో.. ఏం చేయాలి? ఎలా చేయాలి? అందుబాటులో ఉన్న అరకొర వసతులతో పిశాచి వైరస్ ను ఎదుర్కోవటం ఎలా అనే విషయంలో కేసీఆర్ పక్కా ప్లాన్ ను రూపొందించారని చెప్పాలి.
వరుస పెట్టి సమీక్షలు నిర్వహించి.. వారి నుంచి నివేదికలు తెప్పించుకోవటం ద్వారా.. భారీ ప్లాన్ ను సిద్ధం చేశారు. దీనికి తగ్గట్లే.. ఆయన తొలుత మేల్కొని.. ఆంక్షల్ని విధించటం.. లాక్ డౌన్ ను త్వరగా విధించటం లాంటివి కాస్త ముందే విధించటం ద్వారా కరోనా తీవ్రతను అంతో ఇంతో తగ్గించారనే చెప్పాలి. విదేశాల నుంచి వచ్చే ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వీలుగా.. పక్కా ప్లాన్ వేసిన ఆయన.. దానికి తగ్గట్లే అమలు చేయటం షురూ చేశారు.
అన్ని బాగున్నాయి. అనుకున్నట్లే జరుగుతున్నాయి. అంతా ఓకే అనుకుంటూ.. తమ ఏప్రిల్ ఐదారు తారీఖులు వచ్చేసరికి సానుకూల పరిణామాల దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తుందని.. కరోనాను కంట్రోల్ చేయటంలో సక్సెస్ అయినట్లేనన్న విషయం లెక్కలతో సహా రుజువు అవుతుందన్న కలల్ని కన్నారు కేసీఆర్. అయితే.. ఆయన అనుకున్నట్లే జరుగుతున్నా.. ఊహించని రీతిలో మర్కజ్ ఎపిసోడ్ తో సీన్ మొత్తం మారిపోయిందని చెప్పాలి.
గడిచిన ఐదారురోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తున్నప్పుడు.. మర్కజ్ చుట్టూనే ఇప్పటి కేసులు నమోదు కావటంతో కేసీఆర్ డ్రీమ్స్ అన్ని ధ్వంసం అయ్యాయని చెప్పాలి. గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణలో నమోదవుతున్న పాజిటివ్ కేసులన్ని మర్కజ్ చుట్టూనే ఉండటాన్ని మర్చిపోకూడదు. నిజానికి మర్కజ్ ఎపిసోడ్ లేని పక్షంలో కేసీఆర్ చెప్పినట్లే జరిగేది. ఈ నెల ఐదారు తారీఖుల్లో గతానికి చెందిన పలువురు డిశ్చార్జ్ కావటం.. కొత్తగా నమోదయ్యే కేసులు తగ్గిపోయి ఉంటే.. సీన్ మరోలా ఉండేది. అందుకు భిన్నంగా శుక్రవారం ఒక్కరోజే 75 కొత్త కేసులు పాజిటివ్ కావటంతో ఒక్కసారి ఉలిక్కి పడే పరిస్థితి.