Begin typing your search above and press return to search.

70శాతం మందికి మోడీ ఎవరో తెలియదు..

By:  Tupaki Desk   |   9 Jun 2018 10:09 AM GMT
70శాతం మందికి మోడీ ఎవరో తెలియదు..
X
గుజరాత్ ముఖ్యమంత్రిగా కొంతమందికే నరేంద్రమోడీ కొంతమందికే తెలుసు. కానీ ఆ తర్వాత బీజేపీ ప్రధాని అభ్యర్థిగా యావత్ భారతాన్ని జయించి ప్రధాని పీఠాన్ని అధిరోహించాడు. బీజేపీకి అఖండ మెజార్టీని సంపాదించి పెట్టి ఒంటరిగా అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రధాని మోడీ అంటే యావత్ భారతదేశమంతా తెలుసు. కానీ పక్క దేశాల్లో మోడీ గురించి ఎంతమందికి తెలుసు అని ఓ సర్వే చేస్తే ఆసక్తికర ఫలితం బయటపడింది.

అమెరికా పైన ఉండే కెనడా దేశంలో మోడీ అంటే తమకు తెలియదని 75శాతం మంది పేర్కొనడం తాజాగా సంచలనమైంది. ప్రపంచంలోని ప్రభావశీలుర జాబితాలో మోడీ టాప్ 10లో ఉన్నాడు. అలాంటి వ్యక్తి తెలియదని కెనెడా వాసులు ఓ సర్వేలో పేర్కొనడం సంచలనమైంది.

క్యూబెక్ ప్రావిన్స్ లోని చార్లోవిక్స్ ప్రాంతంలో జీ7 నేతల సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా ప్రపంచ నేతల గురించి కెనెడా వాసులకు ఎంతమేరకు తెలుసునే దానిపై సర్వే నిర్వహించారు. ఇందులో మోడీ గురించి కెనెడా వాసులను అడగగా దాదాపు 75శాతం మంది అసలు మోడీ ఎవరో తమకు తెలియదన్నారు. మరికొంత మంది ఆయనను గుర్తించారు. ఆయన ప్రభావవంతమైన నేతగా పేర్కొన్నారు.

ఇక ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి వారి అభిప్రాయాన్ని అడుగగా.. ఆయన అహంకారి అని ఎక్కువమంది చెప్పడం విశేషం. 74శాతం మంది ట్రంప్ అహంకార స్వభావాన్ని కలిగిన వ్యక్తి అని చెప్పారు. మరికొందరు అయితే ఏకంగా అబద్దాల కోరు.. రౌడీ - మోసం చేసే వ్యక్తి - అవినీతిపరుడు అని తిట్టిపోశారు. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడిని మాత్రం ప్రభావవంతుడు - స్ఫూర్తినిచ్చేవాడు - దయాహృదయుడు అని ప్రశంసించడం విశేషం.

ఇదే సర్వేలో తమ సొంత దేశం కెనెడా అధ్యక్షుడు ట్రూడో గురించి సర్వే చేస్తే ఆయన ఆకర్షణీయమైన వ్యక్తి అని ఎక్కువమంది చెప్పడం గమనార్హం.