Begin typing your search above and press return to search.
యడ్యురప్పకు 75 ఏళ్ల గండం తప్పేనా?
By: Tupaki Desk | 25 July 2019 4:26 AM GMTకర్ణాటకలో యడ్డూరప్ప మరోసారి కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానున్నారా?? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే యడ్డూరప్ప మాత్రం తానే సీఎం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ లోలోపల అధిష్టానం వేచి చూసే వైఖరితో ఆయనకు కూడా చెమటలు పడుతున్నాయి. దీనికి కారణం వయసు 75 దాటడమే. బీజేపీ జాతీయ నాయకత్వం సూచనల మేరకు పార్టీలో 75 ఏళ్లు దాటిన వ్యక్తులకు రాజ్యాంగ పదవులు ఇవ్వరాదు. ఈక్రమంలో యడ్డూరప్పకు ఈ సారి మొండి చేయి తప్పదని తెలుస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీతో యడ్డీ 76వ పడిలో అడుగుపెట్టారు. గతేడాది విధానసభ ఎన్నికల నేపథ్యంలో ఆయనను సీఎం అభ్యర్థిగా జాతీయ నాయకత్వం ప్రకటించి తద్వారా గౌరవంగా వీడ్కోలు పలకాలని భావించింది. అనుకున్న విధంగానే పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని యడ్డూరప్ప సీఎం కుర్చీ ఎక్కారు. అయితే మెజారిటీ నిరూపించుకోలేక మూడు రోజుల్లోనే సీఎం పదవికి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీలో పార్టీ పెద్దలు అమిత్ షా - జేపీ నడ్డా ఇతర సీనియర్ నేతలు కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి సీఎం రేసులో బీజేపీ నుంచి యడ్డూరప్ప పేరు మాత్రమే వినిపిస్తోంది.
పార్టీ నిబంధనల మేరకు వయసును పరిగణనలోకి తీసుకుంటే మాత్రం యడ్డీకి చేదు అనుభవం ఎదురు కానుంది. గతంలో ఆనంది బెన్ పటేల్ 75 ఏళ్లు వయసు దాటిన తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేశారు. అలాగే నజ్మా హెప్తుల్లా - జీఎం సిద్ధేశ్వర వంటి వారు కూడా 75 ఏళ్లు రాగానే తమ పదవులకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు పార్టీలో ఈ వయసు నిబంధనను ఒక్కరికి మాత్రమే మినహాయించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ నాయకులు కల్‌రాజ్ మిశ్రాకు ఈ 75 ఏళ్లు అనే నిబంధనను సడలించారు. అదే తరహాలో యడ్యురప్పకు కూడా ఈ నిబంధనను విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కర్ణాటకలో బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడమే యడ్డూరప్పకు కలిసొచ్చే అంశమని చెప్పవచ్చు. అలాగే పార్టీలో యడ్యురప్ప తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న బలమైన రెండో వ్యక్తి తరచి చూస్తే కనిపించడం లేదు. యడ్డూరప్ప కన్నా ఓటు బ్యాంకు ఉన్న నేత బీజేపీలో లేకపోవడంతో కర్ణాటక సీఎంగా నాల్గోసారి అవకాశం యడ్డూరప్పకే దక్కనుంది.