Begin typing your search above and press return to search.
ఆ ప్రైవేట్ హాస్పిటల్ కి రూ.77లక్షలు ఫైన్ ..ఎందుకంటే ?
By: Tupaki Desk | 29 Jun 2020 11:15 AM ISTనిర్లక్ష్యంగా వ్యవహరించి వైరస్ రోగి మృతికి కారణమైన ప్రైవేట్ ఆసుపత్రిపై అధికారులు కొరడా ఝళిపించారు. ఏకంగా ఆ ఆసుపత్రికి రూ.77లక్షలు జరిమానా విధించారు. అంతేకాదు ఆ ఆసుపత్రిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే ... అహ్మదాబాద్ కి చెందిన 73 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడ్డాడు. దీంతో అధికారులు ఆయనను స్థానిక క్వారంటైన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధుడికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. వెంటిలేటర్ అవసరం కలిగింది. దీంతో వెంటనే ఆయనను రాజస్తాన్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఆసుపత్రి గేటు తియ్యడానికి వారికి 20 నిమిషాలు పట్టింది. ఆ 20 నిమిషాలూ ఆ వృద్ధుడిని గేటు బయటే ఉంచారు. సమయానికి ఆక్సిజన్ అందకపోవడంతో వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అక్కడే ఆయన చనిపోయాడు. దీనిపై బంధువుల కోర్టుని ఆశ్రయించారు. దీనిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. వృద్ధుడి మరణానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు .. రాజస్తాన్ లోని ఆ ప్రైవేట్ హాస్పిటల్ కి రూ.77లక్షలు ఫైన్ విధించారు. అందులో 25లక్షలు రాజస్తాన్ హాస్పిటల్ యాజమాన్యం చెల్లించాలి. ఆసుపత్రిలోని ఎనిమిది మంది బోర్డు మెంబర్లుకు చెరో 2 లక్షలు ఫైన్ వేశాము. 18 మంది ట్రస్టీలు కలిసి 36 లక్షలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని కరోనా రోగుల చికిత్స కోసం వినియోగిస్తాము అని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.