Begin typing your search above and press return to search.
ఆ జైలులో 100 మందికి పైగా ఖైదీలు, పోలీసులకు కరోనా !
By: Tupaki Desk | 8 May 2020 5:15 AM GMTకరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడంలేదు ..దేశ ప్రధానుల నుండి సామాన్యుల వరకు అందరి పై ఒకే విదంగా ప్రభావం చూపిస్తూ అందరిని భయంతో వణికిపోయేలా చేస్తుంది. మన దేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకి భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి.అందులోనూ ముంబై నగరాన్ని గజాగజా వణికిస్తోంది. సాధారణ ప్రజలే కాదు..డాక్టర్లు, పోలీసులు కూడా కరోనా బారినపడుతున్నారు.
తాజాగా ముంబైలోని ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలులో 77 మంది ఖైదీలకు కరోనా సోకిన ఘటన ఆందోళన కలిగిస్తుంది. అంతేకాకుండా జైలులోని 26 మంది పోలీస్ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ గురువారం ప్రకటించారు. ఖైదీలు, జైలు సిబ్బందికి కలిపి ఈ జైలులో మొత్తం 100కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడిన ఖైదీలను ప్రత్యేక క్వారంటైన్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి చెప్పారు. మిగతా ఖైదీలకు సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏడేళ్ల కన్న తక్కువ జైలు శిక్షపడిన సుమారు 5వేల మంది ఖైదీలను పెరోల్ పై విడుదల చేస్తామన్నారు అనిల్ దేశ్‌ముఖ్. అలాగే మిగిలిన ఖైదీలకు కూడా కరోనా పరీక్షలు చేస్తామని తెలిపారు.
జైలులో వంట మనిషికి కరోనా సోకిందని, ఇతని నుంచే మిగతా వారికి కరోనా సోకినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో ఏకంగా 1362 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 18,120కి చేరింది. అటు ముంబైలోని ధారవి మురికివాడలో ఇవాళ 50 కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడ ఇప్పటి వరకు మొత్తం 783 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, దేశంలో ఇప్పటి వరకు 52,952 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 1,783 మరణాలు నమోదయ్యాయి. 35,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి.