Begin typing your search above and press return to search.
8 కోట్లు ఆస్తి... పెన్షన్ 5 వేలు కావాలంట...!
By: Tupaki Desk | 19 Dec 2022 4:30 PM GMTప్రభుత్వం సొమ్ము మరి. సర్కార్ వారి ఖజానాకు అందరూ వారసులే. అందరూ హక్కుదారులే. ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలలో పుణ్య పురుషులు పెద్దలకు ఆ డబ్బు దక్కడం న్యాయం కదా. అలా దక్కించుకోవాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది. ఇక విషయానికి వతే ఏపీలో ఒక పెద్దాయనకు ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అంటే బడా కోటీశ్వరుడు అన్న మాట.
ఇంత ఆస్తి ఉన్న ఆ పెద్ద్దాయనకు ఎటూ తాను వృద్ధుడిని కదా అని వృద్ధాప్య పించన్ కి దరఖాస్తు పెట్టేసుకున్నాడు, ఎంచక్కా నెలకు 2,500 రూపాయల పించను వస్తోంది. వచ్చే నెల నుంచి దాన్ని 2,750 రూపాయలకు పెంచుతున్నారు కూడా సరే ఇక్కడితో ఆయనకు సరిపోయిందా అంటే అదేమీ లేదు. ఆ పెద్దాయనకు ఒక వింత కోరిక పుట్టిందట. అదేంటి అంటే ఈ పెన్షన్ తో పాటుగా తాను వికలాంగుడిని కాబట్టి ఆ పెన్షన్ కూడా రావాలని కావాలన్నది ఆయన కోరికట.
దాని కోసం ఆయన సర్పంచ్ మీద తెగ వత్తిడి చేస్తున్నారుట. ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు కూడా లేస్తాడు అని ఒక ముతక సామెత ఉంది. అలా ఎటూ కోటీశ్వరుడు అని చూడకుండా ఓల్డేజ్ పించన్ ఇస్తున్నారు కదా మరి హ్యాండీక్యాప్డ్ పెన్షన్ ఎందుకు వదిలేయలని అని అనుకున్నాడో ఏమో సదరు పెద్ద మనిషి దాని కోసం వీర లెవెల్ లో ట్రై చేస్తున్నాడుట.
అంటే అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న వారు ఉన్నారని దీని బట్టి అర్ధం అవుతోంది. అంతే కాదు మా బంగారాలు మా వాలంటీర్లు మా సైన్యం అని వైసీపీ సర్కార్ మురిసిపోతోంది కానీ అదే వాలంటీర్లు అక్రమంగా చేసే పనులు ఇవన్నీ అని ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. తమకు నచ్చిన వారికి నచ్చినట్లుగా ఇస్తూ ప్రభుత్వ సొమ్ముని ఇలా వేస్ట్ చేస్తూ అనర్హులను పధకాల జాబితాలో చేరుస్తూ అప్పుల ఆంధ్రాకు ఇంకా చిల్లు చేస్తున్నారు.
నిజంగా పెద్దాయన సంఘటన ఒక ఉదంతం మాత్రమే. ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటికి ఏపీ నిండా ఉన్నాయి. కో కోల్లలుగా జరుగుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థను ఏ ఆశయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందో తెలియదు కానీ అనర్హులకే అన్నీ అందుతున్నాయి. అర్హులైన వారు వైసీపీకి నిజమైన అభిమానులు ఉన్న వారికి సైడ్ చేసి పారేస్తున్నారు. వలంటీర్ల వ్యవహారం వల్లనే ఇబ్బడి ముబ్బడిగా పెన్షనర్లు తయారవుతున్నారని అంటున్నారు.
అదే విధంగా వాలంటీర్లు తమకు అనుకూలంగా ఉన్న వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వారికి మేలు చేస్తూ అందులో తాము లబ్దిపొందుతున్నారు. ఫలితంగా ఒకటికి నాలుగు ఇళ్ళు ఉన్న వారు అన్ని పధకాలకు అర్హులు అయిపోతున్నారు. కార్లు ఉన్న వారు బైకులు ఉన్న వారు సైతం పధకాలు చాలా సులువుగా అందుకుంటున్నారు. కానీ నిజమైన వారు అసలైన పేదలు మాత్రం అలాగే ఉండిపోతున్నారు.
వాలంటీలను నమ్ముకుని వారితోనే ఏదో జరిగిపోతోందని, వారే తమకు కళ్ళూ ముక్కూ చెవులూ అని భ్రమపడుతూ ధీమా పడుతున్న ప్రభుత్వానికి నిజంగా వారు చూపించేది సరైన దారేనా అన్న చర్చ అయితే ఉంది. కానీ ప్రభుత్వ పెద్దలు కానీ అధికార పార్టీ నాయకులు కానీ వాలంటీర్లు భేష్ అంటున్నారు. అందరూ కాదు కానీ చాలా మంది మాత్రం అక్రమాల విషయంలో చేయి తడుపు విషయంలో అవినీతి విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు. ఇదే తంతు ఇళ్ళ పట్టాల విషయంలోనూ జరిగింది.
ఏది ఏమైనా ఇపుడు ఏపీలో వైసీపీ పాలనలో రైస్ కార్డు ఉన్న వారిలో చాలా మంది డబ్బున్న వారే. పధకాలు అందుకుంటున్నదీ చాలా మంది ఆస్తిపరులే. పెన్షన్లు తీసుకుంటున్నది కూడా కోటీశ్వరులే. ఇంత పెద్ద అధికార యంత్రాంగాన్ని ఉంచుకుని కూడా అసలైన పేదలు ఎవరో కూడా తెలుసుకోలేని ప్రభుత్వ నిర్వాకం వాలంటీర్ల చేతికి తాళాలు ఇచ్చి అన్నీ అప్పగించిన పాపం ఫలితంగా ఇలా జరుగుతోంది అంటున్నారు. మరి ఏపీలో ఈ ఉల్టా సీదా వ్యవహారాల మీఎద నిఘా పెట్టి నిజం కక్కించే సీన్ ఉంటుందా అన్నదే అందరూ వెయిట్ చేసి చూడాలనుకునేది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.