Begin typing your search above and press return to search.
సండే షాక్: నెల్లూరు జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో 8 మంది మృతి
By: Tupaki Desk | 28 March 2021 5:30 AM GMTహాయిగా దైవ దర్శనం చేసుకుున్నారు. తమ యాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తైందన్న ఆనందంతో ఇంటిముఖం పట్టారు. అయితే.. వారు చేస్తున్న ప్రయాణం వారిని తిరిగి రాని లోకాలకు తీసుకెళుతుందన్న విషయం వారికి తెలీదు. ఈ రోజు (ఆదివారం) ఉదయం నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దామరమడుగు వద్ద లారీని టెంపో వాహనం బలంగా ఢీ కొనటంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆసుపత్రికి తరలించే వేళలో మృత్యువాత పడ్డారు.
ప్రమాదంలో మరణించిన వారంతా తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. వీరంతా శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్లి.. దైవ దర్శనం చేసుకొని తిరిగి వెళుతుండగా ఈ దారుణ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. నేషనల్ హైవే మీద ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీ కొనటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. టెంపోలో మొత్తం 15 మంది ఉండగా.. ఎనిమిది మంది మరణించగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.
మరణించిన వారిలో ఐదుగురు మహిళలు.. ముగ్గురు పురుషులు ఉన్నట్లుగా గుర్తించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. బాధితులంతా తమిళనాడులోని పెరంబదూర్ కు చెందిన వారు. బ్యాడ్ లక్ ఏమంటే.. వారంతా టెంపోలో నెల్లూరు రైల్వేస్టేషన్ కు వచ్చి.. పినాకినీ ఎక్స్ ప్రెస్ లో పెరంబుదూర్ కు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ కు చేరుకోవటానికి దగ్గరగా వచ్చేస్తున్న వేళలోనే ఈ ఘోరం చోటు చేసుకుంది.