Begin typing your search above and press return to search.

భార‌తీయుల‌కు 8 ల‌క్ష‌ల వీసాలు: అమెరికా ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   8 May 2022 2:29 AM GMT
భార‌తీయుల‌కు 8 ల‌క్ష‌ల వీసాలు: అమెరికా ప్ర‌క‌ట‌న‌
X
భార‌తీయ విద్యార్థుల‌కు మ‌రిన్ని వీసాలు ఇచ్చేందుకు తాము నిరంతరం ప‌నిచేస్తున్న‌ట్టు అమెరికా ప్ర‌క‌టించింది. భారతీయుల సేవల కోసం.. త‌మ కార్యాల‌యం తెరిచే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. క‌రోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన గ్యాప్‌ను భర్తీ చేయడానికి వచ్చే ఏడాదిలో 8,00,000 వీసాలను ప్రాసెస్ చేయడానికి మరింత మంది సిబ్బందిని చేర్చుకోవాలని భారత్ లోని దౌత్య కార్యాల‌యం, దాని కాన్సులేట్‌లు యోచిస్తున్నాయని సీనియర్ యుఎస్ దౌత్యవేత్త డొనాల్డ్ ఎల్ హెఫ్లిన్ పేర్కొన్నారు.

అమెరికా రాయబార కార్యాలయంలోని కాన్సులర్ వ్యవహారాల మంత్రి కౌన్సెలర్ డొనాల్డ్ ఎల్ హెఫ్లిన్ విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థి వీసాలలో కూడా కొన్ని మార్పులు వ‌స్తున్నాయని, రానున్న వారాల్లో వాటిని ప్రకటిస్తామని చెప్పారు.

డొనాల్డ్ చెప్పిన విష‌యం ప్రకారం, రాబోయే 12 నెలల్లో సుమారు 800,000 వీసాలు ఆమోదించనున్న‌ట్టు తెలుస్తోంది. వీసాల జారీకి తాము చాలా స్లాట్‌లను తెరిచామని, హెచ్‌ అండ్‌ ఎల్‌ వీసాల డిమాండ్‌ను తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

కోవిడ్ -19 వ్యాప్తికి ముందు, యుఎస్ 1.2 మిలియన్ వీసాలు జారీ చేసింది. అయితే.. ఈ డిమాండ్ ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో రాబోయే రెండేళ్లలో ఈ డిమాండ్‌ను త‌ట్టుకునేలా వీసాలు జారీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు డోనాల్డ్ చుప్పారు. కోవిడ్ కారణంగా నిలిపివేసిన భారతీయ వీసాల సంఖ్య చాలా ఎక్కువగా లేదని డొనాల్డ్ స్ప‌ష్టం చేశారు.

విద్యార్థుల వీసాల గురించి కూడా రాబోయే వారాల్లో రాయబార కార్యాలయం మరిన్ని ప్రకటనలు వ‌స్తాయ‌ని ఆయన చెప్పారు.అయితే.. దీని విష‌యంలో ఎవ‌రూ ఎలాంటి ఆంందోళ‌నా చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

తాము హైదరాబాద్‌లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని, భారీ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు కొత్త సిబ్బందికి వసతి కల్పించేందుకు న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో మరిన్ని శాఖలను ప్రారంభించనున్నట్లు డొనాల్డ్ చెప్పారు.

అన్ని కాన్సులేట్‌లకు శాశ్వత ఫోన్ నంబర్, వీసా దరఖాస్తుదారులకు వారి అపాయింట్‌మెంట్ల గురించి ఇ-మెయిల్ చిరునామా ఇస్తామ‌ని ఆయన హామీ ఇచ్చారు. మొత్తానికి భార‌తీయుల ప‌ట్ల అమెరికా చూపుతున్న చొర‌వ‌కు స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతుండ‌డం గ‌మ‌నార్హం.