Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : 8 నెలల చిన్నారికి కరోనా !
By: Tupaki Desk | 27 March 2020 5:50 AM GMTప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ని నియంత్రించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ మరణాలు - బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. భారత్ లో వేగంగా విజృంభిస్తూ ఎందరో ప్రాణాలని బలిగొంటున్న కరోనా వైరస్.. చిన్నా - పెద్ద అన్న తేడా లేకుండా అందరికి అంటుకుంటుంది. తాజాగా శ్రీనగర్ లో తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కావడం గమనార్హం.
ఈ ఇద్దరు పిల్లలలో ఒకరు 8 నెలల చిన్నారి కాగా - మరొకరు ఏడు సంవత్సరాల వయస్సు గల అమ్మాయి. ఈ చిన్నారులు సౌదీ అరేబియా నుంచి ఇటీవలే శ్రీనగర్‌కు తిరిగివచ్చి కోవిడ్-19 పాజిటివ్ గా గుర్తించిన వ్యక్తి మనవళ్లని అధికారులు తెలిపారు. రెండు తాజా కేసులతో జమ్ము కశ్మీర్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కు పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గురువారం 733కు చేరగా మృతుల సంఖ్య 20కి పెరిగింది. మహమ్మారిని పారదోలేందుకు పలు దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండగా - సామాజిక దూరం పాటించి ప్రాణాంతక వైరస్ ను ఓడించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 532,263 మంది కరోనా భారిన పడగా ... 24,090 మంది కరోనా వైరస్ తో మృతి చెందారు.