Begin typing your search above and press return to search.

వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8మంది మృతి.. పరారీలో డాక్టర్

By:  Tupaki Desk   |   6 May 2021 1:30 PM GMT
వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8మంది మృతి.. పరారీలో డాక్టర్
X
వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8మంది మృతిచెందిన ఘటన చత్తీస్ ఘడ్ లో చోటుచేసుకుంది. చత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ లో ఒకే కుటుంబానికి చెందిన 8మంది గురువారం చనిపోగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. హోమియోపతి మందు తాగడం వల్లే మరణాలు సంభవించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇతర కారణాలు తెలుసుకోవడానికి టీం ఏర్పాటైంది.

చత్తీస్ ఘడ్ సీఎంవో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వ్యక్తులు 91శాతం అల్కహాల్ కలిగి ఉన్న హోమియోపతి డ్రొసెరాను 30న తాగారు. ఈ మందును వారికి ఇచ్చిన డాక్టర్ పరారీలో ఉన్నాడు. కరోనా సంక్రమణను నివారించడానికి ఈ వ్యక్తులు అల్కహాల్ కలిగిన ఈ ఔషధాన్ని తీసుకున్నారని చెబుతున్నారు.

కాగా పారిపోయిన డాక్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరి మరణాలకు అసలు కారణాలు తెలియాల్సి ఉంది.

వైద్యం వికటించిన మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం వివేషం. ఇక డాక్టర్ పరారీలో ఉండడంతో అతడు ఏ హోమియో మందు ఇచ్చాడు? ఎందుకు వికటించిందనే దానిపై ఆరాతీస్తున్నారు.