Begin typing your search above and press return to search.
8 ఏళ్ల చిన్నారిని 4 రోజులు గుడిలో గ్యాంగ్ రేప్!
By: Tupaki Desk | 13 April 2018 5:06 AM GMTఈ దారుణాన్ని చెప్పేందుకు నోరు రాని పరిస్థితి. ఈ విషయాన్ని రిపోర్ట్ చేసేటప్పుడు చేతులు వణికే పరిస్థితి. దేవుడా.. ఎందుకిలా ఉండిపోయా్.. ఆ పాపాత్ముల్ని వెంటనే ఏమైనా చేసేయ్ అంటూ ఈ ఉదంతం గురించి తెలిసినంతనే మనసులో కలిగే భావన ఇది. జమ్ముకశ్మీర్ లో ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారటమే కాదు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఈ వైనం మనసును చేదుగా మార్చటమే కాదు.. మనుషుల్లోని పశుత్వం ఏం చేస్తే పోతుందన్న సందేహం రాక మానదు
అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిని గుడిలో బంధించి నాలుగు రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేసిన వైనం ఇప్పుడు గుండెలు రగిలిపోయేలా చేయటమే కాదు..ఆ పాపానికి పాల్పడిన వ్యక్తుల్ని ఏం చేసినా ఫర్లేదన్న భావన కలగటం కాయం. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అన్నది చూస్తే.. జమ్ము కశ్మీరులోని కథువా జిల్లా హీరానగర్ లోని తహసీల్ పరిధిలోని రస్సానాలో జనవరి 10న ఘోరం జరిగింది. గోవధ చేశారన్న అనుమానంతో పాటు.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని.. ఆ కారణంతో పిల్లలు పాడైపోతున్నారంటూ మండిపడిన రస్సానాలోని ఒక వర్గం వారు బకర్వాల్ ముస్లింలను ఊళ్లో నుంచి తరిమివేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా చిన్నారిపై దారుణంగా వ్యవహరించారు. 8 ఏళ్ల చిన్నారిని బంధించి.. నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణంలో రిటైర్డ్ రెవెన్యూ అధికారి సాంజీ రామ్ తో పాటు అతని మేనల్లుడు.. కొడుకు.. మేనల్లుడి స్నేహితుడు.. ఒక ఎస్ ఐ.. మరో హెడ్ కానిస్టేబుల్.. ఇద్దరుప్రత్యేక పోలీస్ అధికారుల్ని నిందితుల్నిగా చార్జిషీటులో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంపై తాజాగా జమ్ముకశ్మీర్ క్రైంబ్రాంచ్ పోలీసులు అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. ఇందులో ఉన్న అంశాల్ని చూస్తే..
జనవరి 10న తన ఇంటి బయట గుర్రాల్ని మేపుతున్న బాలికను అపహరించిన సాంజీరామ్ తమకు చెందిన గుడికి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చారు. ఆ తర్వాత ఆ చిన్నారిపై అత్యాచారం చేయాలని తన మేనల్లుడు సాంజీరామ్ ను ఊసిగొల్పారు. ఆ తర్వాత కొడుకు విశాల్.. పోలీసు అధికారి దీపక్ కూడా అత్యాచార దుర్మార్గానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల పాటు ఒకరి తర్వాత ఒకరు అనేకసార్లు ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత జనవరి 14న సాంజీ మేనల్లుడు ఆమెను దుడ్డుకర్రతో తీవ్రంగా కొట్టి చంపేశాడు. ఆమె మృతదేహాన్ని గుడికి సమీపంలోని అడవుల్లో పడేశారు.
ఈ దారుణాన్ని కప్పి పుచ్చేందుకు స్థానిక పోలీసులకు రూ.3లక్షల లంచం ఇచ్చారు. ఇప్పటివరకూ ఈ కేసులో మొత్తం 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ నెల 16న స్థానిక కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. ఈ ఘటనపై విచారణ జరపాలంటూ జమ్ముహైకోర్టు బార్ అసోసియేషన్ బంద్ కు పిలుపునివ్వటంతో బుధవారం జనజీవనం స్తంభించింది.
ఇదిలా ఉంటే నిందితులకు మద్దతుగా జరిపిన ర్యాలీలో బీజేపీ మంత్రులు ఇద్దరు పాల్గొనటం వివాదంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై కేంద్రమంత్రి వీకే సింగ్ తొలిసారి స్పందించారు. మనుషులుగా మానవత్వాన్ని మరిచి చిన్నారిని ఓడించామని ఆమెకు న్యాయం తప్పక జరిగి తీరాలని వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేయటం దారుణాతి దారుణ ఘటనగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ వ్యాఖ్యానించారు. మానవత్వానికే మాయని మచ్చగా ఉన్న ఇలాంటి ఉదంతాల్లో రాజకీయాల్లోకి చోటిస్తే మనం మనుషులుగా మారుతామా? అని ప్రశ్నించారు.
ఈ ఉదంతంపై బాలీవుడ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. మనం మనుషులమేనా? అని ప్రశ్నించటంతో పాటు పసిబిడ్డలపై కామాంధులు పైశాచికానికి పాల్పడుతుంటే కళ్లు మూసుకొని కూర్చుందామా? ఏమైపోతోంది సభ్య సమాజం? అంటూ ప్రశ్నించారు. ఉన్నావ్.. కఠువా ఘటనలపై దియా మీర్జా.. అక్షయ్ కుమార్.. అభిషేక్ బచ్చన్.. సోనమ్ కపూర్.. రిచా చడ్డా.. అర్జున్ కపూర్.. ఫర్హాన్ అక్తర్ లతో పాటు.. పెద్ద ఎత్తున బాలీవుడ్ తారలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి అసీఫా ఫోటోను అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. దీనిపై ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా స్పందిస్తూ.. ఇప్పుడు కాకుంటే మరెప్పుడు మనమంతా ఒకటికాగలమని వ్యాఖ్యానించారు. నిజమే.. ఈ ఘటనకు స్పందించని వాడు మనిషే కాడంతే.