Begin typing your search above and press return to search.
మునుగోడు దెబ్బకు 80 రోజుల వారి సమ్మె సుఖాంతం
By: Tupaki Desk | 13 Oct 2022 5:11 AM GMTఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 రోజులుగా నడుస్తోంది రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్ఏల సమ్మె. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న హామీలు అమలు కాకపోతున్న నేపథ్యంలో వారు సమ్మె చేస్తున్నారు. అయినా.. ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. దాని గురించి మాట్లాడింది లేదు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో వీఆర్ఏల సమ్మె ప్రభుత్వానికి చికాకుగా మారింది. ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడే పరిస్థితి.
దీనికి తోడు హైదరాబాద్ లో సమ్మె చేస్తున్న మహిళా వీఆర్ఏలను గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించటం.. అక్కడ వారి పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ.. రాత్రి వరకు స్టేషన్ లో ఉంచటంపై ఆగ్రహం వ్యక్తమైంది.
కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరగటం లేదన్న వాదనకు వీఆర్ఏలు చేస్తున్న సమ్మెను చూపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో.. ఈ ఇష్యూకు చెక్ పెట్టాలని సర్కారు డిసైడ్ అయినట్లుంది. ఇందులో భాగంగా వీఆర్ఏల జేఏసీ నేతల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తన చాంబర్ కు పిలిపించి మాట్లాడారు. వారి డిమాండ్లలో ప్రధానమైన వాటిని తీర్చేందుకు ప్రభుత్వం తరఫున సీఎస్ ఓకే చెప్పారు.
దాదాపు అరగంట పాటు సాగిన చర్చలతో 80 రోజులుగా సాగుతున్న సమ్మెకు సుఖాంతమైన ముగింపు ఇచ్చినట్లైంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనవి పే స్కేల్.. అర్హులైన వారికి పదోన్నతులు.. వయో పరిమితి మీరిన వారి వారసులకు ఉద్యోగాలు.. వీఆర్ఏలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించటం.. సమ్మె కాలానికి వేతనం.. సమ్మె సాగిన 80రోజుల్లో మరణించిన వీఆర్ఏ కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా లాంటి సమస్యలపై మానవతా కోణంలో ఆదుకోవాలని కోరగా.. సీఎస్ సానుకూలంగా స్పందించారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. వారి డిమాండ్లపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
వచ్చే నెల ఏడున ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏల జేఏసీని పిలిపించుకొని మాట్లాడతారని.. వారి సమస్యల పరిష్కారం కోసంచర్యలు చేపడతారని చెప్పారు. దీంతో సంతృప్తి చెందిన విఆర్ఏ జేఏసీ నేతలు సమ్మెను ముగిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఇదంతా చూస్తే.. మునుగోడు ఉప పోరు వేళ.. ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవటమే లక్ష్యంగా చర్చలకు ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. మరి.. సీఎస్ హామీ ఇచ్చినట్లుగా వచ్చే నెల ఏడున వీఆర్ఏల జేఏసీని సీఎం పిలిపిస్తారా? అన్నది కాలమే సరైన సమాధానం చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.