Begin typing your search above and press return to search.
ఆ వ్యక్తికి వైద్యం చేసేందుకు నో చెప్పేసిన 80 హాస్పిటల్స్
By: Tupaki Desk | 19 April 2020 11:30 PM GMTఇంత దారుణమైన పరిస్థితి ఏ వెనుకబడి దేశంలోనో అయితే సర్లేనని అర్థం చేసుకోవచ్చు. సాంకేతికతలో తోపు దేశంగా.. విపత్తుల్ని నిత్యం ఎదుర్కొనే దేశంగా చెప్పుకునే జపాన్ లాంటి సంపన్న దేశంలో తాజా పరిస్థితి తెలిస్తే ముక్కున వేలేసుకోవటం ఖాయం. సునామీ.. భూకంపాలు విరుచుకుపడిన వేళలోనూ.. తట్టుకొని నిలిచే గుణం ఉన్న జపాన్.. కరోనా విషయంలో మాత్రం కుదేలు అయినట్లుగా చెప్పక తప్పదు. కరోనా కారణంగా జపాన్ లో కేసుల సంఖ్య పెరగటంతో.. అత్యవసర రోగులకు సైతం వైద్యం చేసేందుకు నో చెప్పేస్తున్నాయి ఆ చిట్టి దేశంలోని పలు ఆసుపత్రులు.
కరోనా లక్షణాలు తీవ్రంగా బాధపడుతున్న టోక్యోకు చెందిన వ్యక్తికి వైద్యం చేసేందుకు 80 ఆసుపత్రులు నో చెప్పటం చూస్తే.. తాజాగా జపాన్ లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జ్వరం.. శ్వాసకోశ సమస్యలతో బాధ పడుతున్న సదరు వ్యక్తికి వైద్యం అందించేందుకు ఎనభై ఆసుపత్రులు నో చెప్పటానికి కారణం.. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీగా లేకపోవటమే కారణం. చివరకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ.. నగర శివారులోని ఒక ఆసుపత్రిలో చేరారు.
ఈ ఒక్క కేసు మాత్రమే కాదు... ఈ తరహాలో మరెన్నో కేసుల విషయంలో జరిగినట్లుగా తెలుస్తోంది. నాణ్యమైన వైద్యానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పే జపాన్ లో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే.. దేశంలో లాక్ డౌన్ విధించినా కరోనా వైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందటమే కారణం. దీనికి తోడు ప్రభుత్వం నిర్దేశించిన లాక్ డౌన్ నియమావళిని పాటించటంలో జపాన్ దేశస్తులు ఫెయిల్ కావటం కూడా కొత్త కేసులకు కారణంగా చెప్పక తప్పదు.
జపాన్ రాజధాని టోక్యో.. ఒసాకా లాంటి పెద్ద నగరాల్లో భౌతిక దూరం నిబంధనను పాటించటంలో ఫెయిల్ అయ్యాయి. దీనికి తోడు.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఉన్న వారు ఆసుపత్రుల్లో చేరిపోవటంతో.. అత్యవసరమైన వారికి ఆసుపత్రుల్లో చేరేందుకు అవకాశం లభించని పరిస్థితి. ఈ కారణంగా గుండెపోటు లాంటి తీవ్రమైన కేసుల్ని సైతం ఆసుపత్రులు తామేమీ చేయలేమని చేతులు ఎత్తేస్తున్నాయి.
వైద్య పరికరాల కొరత.. పీపీఈలు సరిపడా లేకపోవటంతో కూడా ఒక సమస్యగా చెబుతున్నారు. ఎన్ 95 మాస్కుల్ని రెండు..మూడుసార్లు వాడేంత దారుణమైన పరిస్థితుల్లో జపాన్ చిక్కుకుంది. ఒసాకా నగరంలో అయితే హజ్మత్ సూట్ల కొరతతో రెయిన్ కోట్లను వాడేయటం చూస్తే.. సంపన్న దేశమైన జపాన్ లో పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
మరో షాకింగ్ అంశం ఏమంటే.. నెల వ్యవధిలో అంబులెన్సులు తెస్తున్న పేషెంట్లను ఐదుకు పైగా ఆసుపత్రులు తాము వైద్యం చేయలేకపోయామని రిజెక్టు చేసిన ఘటనలు ఏకంగా 931 సార్లు చోటు చేసుకున్నాయట. ఏప్రిల్ లో తొలి పదకొండు రోజుల్లోనే ఇలాంటి దుస్థితి 830 సార్లు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. దేశంలో కరోనా కేసుల తీవ్రత అంతకంతకూ పెరుగుతోందని.. వెంటిలేటర్ల కొరత కారణంగా జపాన్ లాంటి చిట్టి దేశంలో ఏకంగా నాలుగు లక్షల మంది మరణించే అవకాశం ఉందన్న వాదన విపిసిస్తోంది.