Begin typing your search above and press return to search.
మెక్సికోను అతలాకుతలం చేసేసిన భూకంపం
By: Tupaki Desk | 9 Sep 2017 5:16 AM GMTమెక్సికోలో భారీ భూకంపం అతలాకుతం చేసేసింది. గత వందేళ్లలో ఇంత భారీ భూకంపం సంభవించడం మెక్సికోలో ఇదే మొదటిసారి. ఈ విపత్తు కారణంగా 35 మంది మృతిచెందగా వందలాది మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 8.1గా నమోదైంది. 1985లో వచ్చిన భూకంపం ధాటికి మెక్సికోలో 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం అర్ధరాత్రి టొనాలా పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ సముద్ర తీరంలో భూమి కంపించింది. దాదాపు 69.7కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. అర్ధరాత్రి భూకంపం సంభవించడం - భవనాలు కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూకంప తీవ్రత చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా విస్తరించింది.
మెక్సికో అధ్యక్షుడు ఎన్ రిక్వి పెన్నా నియెటో మాట్లాడుతూ ఇంత భారీ భూకంపాన్ని తాను ఎప్పుడూ చూడలేదని, వందేళ్లలో భారీ భూకంపం సంభవించడం ఇదే మొదటిసారి అని చెప్పారు. పరిస్థితి చూస్తుంటే సునామీలా ఉందని పేర్కొన్నారు. జుచిటాన్ ప్రాంతంలోనే 17 మంది చనిపోయారని, మిగతా చోట్ల 18 మంది మృతిచెందారని తెలిపారు. శుక్రవారం 11 రాష్ర్టాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అత్యవసర ప్రతిస్పందన కేంద్రం అధికారులు మాట్లాడుతూ భూకంపం సంభవించిన సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నారని చెప్పారు. మెక్సికో తీరంలో ఒక మీటరు ఎత్తుతో అలలు ఎగసిపడ్డాయని వివరించారు. అయితే ఒక్కసారిగా భవనాలు కుప్పకూలడంతో చాలా మంది శిథిలాల్లో చిక్కుకున్నారని, చాలా భవనాలకు పగుళ్లు వచ్చాయని తెలిపారు. ఈక్వెడార్, ఎల్‌సాల్వడార్, గ్వాటెమాలా తీర ప్రాంతాల్లోను మీటరు, అంతకంటే తక్కువ ఎత్తులో అలలు ఎగసిపడ్డాయని వెల్లడించారు. జూచిటాన్ ప్రాంతంలో ఓ హోటల్ కుప్పకూలిందని పేర్కొన్నారు.
ఈ విపత్తుపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ తాము కారులో వెళుతుండగా ఒక్కసారిగా భూమి కంపించిందని తెలిపారు. భూకంపం ధాటికి విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. భూకంప తీవ్రతకు కొన్ని ఇళ్లు కుప్పకూలి మట్టి దిబ్బలా మారాయని వివరించారు. మెక్సికో రాజధాని మెక్సికో సిటీ ప్రజలు మాట్లాడుతూ అర్ధరాత్రి భూకంపం అలారం మోగిందని, దీంతో భయంతో ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీశామని చెప్పారు. మరోవైపు భూకంపం సంభవించగానే అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రంగంలోకి దిగిన పోలీసు బలగాలు, విపత్తు ప్రతిస్పందన బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మెక్సికోలో 5 కోట్ల మంది పై ప్రభావం ఉంది.