Begin typing your search above and press return to search.
ఈసీకి కొత్త తలనొప్పి తెచ్చిన ఆర్కేనగర్?
By: Tupaki Desk | 27 March 2017 9:37 AM GMTఅన్ని ఉప ఎన్నికలు ఎంతమాత్రం ఒకేలా ఉండవు. ఆ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ.. అమ్మ మరణంతో నిర్వహిస్తున్న ఆర్కే నగర్ ఉప ఎన్నిక మాత్రం అంత తేలిగ్గా పూర్తయ్యే వ్యవహారం కాదన్న విషయం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే అర్థమైందంటున్నారు. మిగిలిన ఉప ఎన్నికల మాదిరే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అంచనా వేసినప్పటికీ... ఊహించని రీతిలో ఎదురైన ఇబ్బంది ఎన్నికల సంఘానికి ఆందోళనకు గురి చేస్తోంది.
బ్యాలెట్ బ్యాక్సులకు ఈసీ మంగళం పలికి చాలా కాలమే అయ్యింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా.. దాదాపుగా ఈవీఎంలతోనే ఎన్నికల్ని పూర్తి చేసేస్తున్నారు. అయితే.. ఆర్కే నగరిలోఎన్నికల సంఘం ఏ మాత్రం ఊహించని రీతిలో రికార్డు స్థాయిలో అభ్యర్థులు బరిలో నిలవటంతో ఈసీకి కొత్త తలనొప్పి మొదలైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈవీఎం మెషిన్లలో కేవలం 63 బటన్లు మాత్రమే ఉంటాయి. అందులో నోటా బటన్ ను మినహాయిస్తే మిగిలేవి 62 బటన్లు.
ఒక్కో బటన్.. ఒక్కో అభ్యర్థికి కేటాయించారనుకుంటే.. ఒక ఉప ఎన్నికకు 62 మంది అభ్యర్థులు నిలబడినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.తాజాగా జరుగుతున్న అమ్మ ఉప ఎన్నికలో ఏకంగా 82 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయటంతో.. అధికారులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. సాధారణంగా ఇంత భారీ ఎత్తున నామినేషన్లు వేస్తే.. అందులో కొన్ని అయినా చెల్లని నామినేషన్లు ఉండటం.. వాటిని తిరస్కరించటం లాంటివి జరుగుతాయి. కానీ.. తాజా ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలన్నీ సరిగ్గా ఉండటంతో తిరస్కరించే అవకాశం లేదని తెలుస్తోంది.
నిజానికి నామినేషన్లు దాఖలు చేసిన 82 మంది అభ్యర్థుల్లో 11 మంది డమ్మీ అభ్యర్థులు ఉన్నారు. నామినేషన్ల ఉప సంహరణ సమయానికివీరంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నా.. ఇంకా.. 71 మంది బరిలో ఉంటారు. ఈవీఎంలలో 62 మంది అభ్యర్థులకు మాత్రమే ఆప్షన్ ఉండటంతో అయితే మరింత మంది అభ్యర్థులున్న ఈఎవీఎంలు తయారు చేయించటం.. లేదంటే బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలి. క్లనామినేషన్ల ఉపసంహరణ డేట్ దాటిన తర్వాత ఈ విషయంపై మరికాస్త క్లారిటీ వస్తుందని.. అప్పటివరకూ ఊహాగానాలు తప్పవని చెబుత్నారు. చూస్తుంటే.. ఆర్కేనగర్ ఉప ఎన్నిక కేంద్ర ఎన్నికల సంఘానిక సరికొత్త పరీక్షలా మారుతుందటనంలో సందేహం లేదని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/