Begin typing your search above and press return to search.
బ్యాంక్ లాకర్ గదిలో 84 ఏళ్ల పెద్దాయన.. యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్వాకం
By: Tupaki Desk | 30 March 2022 5:35 AM GMTవిన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. అసలు ఇలా కూడా జరుగుతుందా? అన్న విస్మయానికి గురి చేసే ఉదంతం హైదరాబాద్ లోని సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోటు చేసుకుంది. యూనియన్ బ్యాంకు లాకర్ గదిలో ఉన్న 84 ఏళ్ల పెద్దాయన్ను పట్టించుకోకుండా.. గదికి తాళం వేసేసి.. తమ దారిని తాము వెళ్లిపోయారు బ్యాంకు సిబ్బంది.
సోమవారం సాయంత్రం 4.20 గంటల వేళలో చోటు చేసుకున్న ఆయన.. మంగళవారం ఉదయం బ్యాంకు తెరిచే వరకు అందులోనే ఉండిపోయిన వైనం షాకింగ్ గా మారింది. నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
జూబ్లీహిల్స్ రెోడ్డు నెంబరు 67లో నివాసం ఉంటున్నారు 84 ఏళ్ల క్రిష్ణారెడ్డి. సోమవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్ లోని యూనియన్ బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లారు. లాకర్ ను వాడుకునేందుకు లోపలకు వెళ్లిన ఆయన్ను పట్టించుకోకుండానే.. బ్యాంకు సిబ్బంది బ్యాంకుకు తాళం వేసి వెళ్లిపోయారు. బ్యాడ్ లక్ ఏమంటే.. క్రిష్ణారెడ్డి తన వెంట మొబైల్ ఫోన్ ను తెచ్చుకోవటం మర్చిపోయారు. దీంతో.. ఏం చేయాలో తోచక రాత్రంతా లాకర్ గదిలోనే ఉండిపోయారు.
ఇదిలా ఉండగా.. బయటకు వెళ్లిన తమ తండ్రిఇంటికి తిరిగి రాకపోవటంతో క్రిష్ణారెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫిర్యాదు నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. అందులో క్రిష్ణారెడ్డి యూనియన్ బ్యాంకులోకి వెళ్లినట్లుగా రికార్డు అయినా.. బయటకు రావటం మాత్రం కనిపించలేదు. దీంతో పలు కెమేరాల్ని పరిశీలించిన పోలీసులు.. చివరకు మంగళవారం ఉదయం యూనియన్ బ్యాంకు మేనేజర్ కు సమాచారం ఇచ్చారు.
దీంతో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బ్యాంకు తెరిచి చూడగా.. లాకర్ రూపంలో స్ప్రహ కోల్పోయిన ఆయన్ను గుర్తించారు. వెంటనే ప్రథమ చికిత్స చేసిన క్రిష్ణారెడ్డి కుటుంబ సభ్యులు.. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. షుగర్ వ్యాధితో బాధ పడుతున్న ఆయన్ను.. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేశారంటూ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. లాకర్ లో ఎవరైనా ఉన్నారా? లేరా? అన్న విషయాన్ని పట్టించుకోకుండా బ్యాంకు సిబ్బంది తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.