Begin typing your search above and press return to search.

వంద‌ల కోట్లు ఇస్తున్న ఊరుపేరు లేనోళ్లు!

By:  Tupaki Desk   |   19 Aug 2015 10:15 AM GMT
వంద‌ల కోట్లు ఇస్తున్న ఊరుపేరు లేనోళ్లు!
X
ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం. దేశంలోని రాజ‌కీయ పార్టీల‌కు అందుతున్న విరాళాల్లో అత్య‌ధిక భాగం ఊరుపేరు తెలీనివాళ్లు ఇస్తున్న మొత్త‌మే. అలా అని ఆ మొత్తం ఏదో ప‌ది..పాతికో కాకుండా వంద‌ల కోట్ల రూపాయిలు ఉండ‌టం గ‌మ‌నార్హం.

రాజ‌కీయ పార్టీల‌కు గ‌త ఏడాదిగా వ‌చ్చిన ఆదాయాల‌కు సంబంధించిన వివ‌రాలు తెల‌పాల్సిందిగా భార‌త ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేస్తే.. కాంగ్రెస్‌.. బీఎస్పీ.. సీపీఎం.. సీపీఐ లాంటి పార్టీలు పంపితే.. అధికార బీజేపీ మాత్రం ఇంకా వివ‌రాలు పంప‌టానికి తీరిక దొర‌క‌లేదు. అదేంట‌ని అడిగితే.. ఈ జులై 9 వ‌ర‌కు గ‌డువు కోరింది. అయిన‌ప్ప‌టికీ ఇంకా పంప‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. అధికారంలో ఉంటే పార్టీల‌కు నిబంధ‌న‌లు వ‌ర్తించ‌వా అన్న‌ట్లుగా బీజేపీ తీరు ఉంది.

బీజేపీ మిన‌హా మిగిలిన పార్టీల వ్య‌వ‌హారాన్ని చూస్తే మ‌రికాస్త ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌టం ఖాయం. ఎందుకంటే.. 2013..14 మ‌ధ్య కాలంలో వివిధ పార్టీల‌కు అందిన మొత్తం రూ.844కోట్లుగా చెబుతున్నారు. మ‌రింత షాకింగ్ విష‌యం ఏమిటంటే.. ఈ మొత్తంలో దాదాపు 80శాతం నిధులు ఎవ‌రి నుంచి వ‌చ్చాయో తెలీని ప‌రిస్థితి. అంటే.. రూ.673కోట్లు అన్న మాట‌.

ఇంకా.. వివ‌రంగా చెప్పాలంటే ఊరు..పేరు లేకుండానే వంద‌లాది కోట్లు ఇచ్చేసిన‌ట్లు. మొత్తం 844కోట్ల రూపాయిలో 80 శాతం అంటే దాదాపు 673 కోట్ల‌కు పైనే.. ఎవ‌రు ఇచ్చారో కూడా తెలీకుండానే పార్టీల ఖాతాల్లోకి చేరిపోతున్నాయ‌ని పేర్కొన్నాయి. ఇక‌.. పార్టీల‌కు నిధులు అందిన వాటిల్లో కాంగ్రెస్ అగ్ర‌స్థానంలో ఉంది (బీజేపీ ఇంకా వివ‌రాలు ఇవ్వ‌లేదు కాబ‌ట్టి). ఆ పార్టీకి మొత్తంగా 2013.. 14 ఆర్థిక సంవ‌త్సరంలో రూ.598 కోట్లు అంద‌గా.. సీపీఎం 121 కోట్ల రూపాయాల్ని సేక‌రించింది. మ‌రి.. ఇంత భారీ మొత్తాన్ని ఊరు పేరులేకుండా ఇచ్చేస్తుంటే... పార్టీలు ఎలా తీసేసుకుంటున్నాయి..?