Begin typing your search above and press return to search.
అద్భుతం: 85ఏళ్ల వయసులో కరోనాను జయించింది..
By: Tupaki Desk | 22 April 2020 9:31 AM GMTఆంధ్రప్రదేశ్ లో అద్భుతం జరిగింది. ఏకంగా 85 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు ఏకంగా కరోనాను జయించడం సంచలనంగా మారింది. కోవిడ్ -19 వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న ఆ మహిళ ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ కావడం విశేషం.
అనంతపురం జిల్లాకు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలికి ఈనెల 5న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆమెను అనంతపురం జిల్లా కేంద్రంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రిలో ఉంచి చికిత్సనందించారు. 60ఏళ్ల దాటినవారికి కరోనా డేంజర్. బతికి బట్టకట్టడం వారు చాలా అరుదు. కానీ ఈ మహిళ ఏకంగా 85 ఏళ్ల వయసులో జయించడం విశేషం. చికిత్స పూర్తయిన తర్వాత కూడా ఈమెకు ప్రొటోకాల్ ప్రకారం రెండు సార్లు కరోనా పరీక్షలను నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. రెండు పరీక్షల్లోనూ నెగెటివ్ రావడంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు.
85ఏళ్ల ఈ మహిళ కనీసం నడవలేకుండా అయినా కరోనాను జయించి చక్రాల కుర్చీలో డిశ్చార్జ్ అవుతూ విజయసంకేతం చూపించడం విశేషం.
ఈనెల ఆరంభంలో ఆమె కొడుకు ద్వారా ఈ ముసలావిడకు కరోనా వైరస్ సంక్రమించింది. ఆమె మనవడికి, మరో ముగ్గురికి కూడా వీరి ద్వారా కరోనా వ్యాపించింది.
అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో ముగ్గురు మరణించారు. 26మంది చికిత్స పొందుతున్నారు. ఏడుగురు ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు.