Begin typing your search above and press return to search.

షాకింగ్ : 88 మంది మెడికల్‌ సిబ్బందికి కరోనా !

By:  Tupaki Desk   |   27 April 2020 7:50 AM GMT
షాకింగ్ : 88 మంది మెడికల్‌ సిబ్బందికి కరోనా !
X
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతుంది. లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా భాదితుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. కరోనా కట్టడిలో తీసుకురావడానికి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు ..అయినప్పటికీ కూడా కరోనా కంట్రోల్ లోకి రాకపోవడంతో అటు ప్రభుత్వంలో ..ఇటు ప్రజలలో ఆందోళన ఎక్కువైపోతోంది. తాజాగా ఢిల్లీలోని బాబా సాహెబ్‌ అంబెద్కర్‌ ఆసుపత్రిలో పనిచేసే 30 మంది మెడికల్ సిబ్బందికి కరోనా నిర్దారణ అయ్యింది అని ప్రచార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

బాబా సాహెబ్‌ అంబెద్కర్‌ ఆసుపత్రిలో పని చేసే వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది - ఆరోగ్య కార్యకర్తలు సహా 39 మందికి కరోనా వైరస్‌ కు సంబంధించి లక్షణాలు ఉన్నట్ల అనుమానం రావటంతో క్వారంటైన్‌ కు తరలించారని, వారికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 30 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది అని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

అలాగే, బాబు జ‌గ్జీవ‌న్‌ రామ్ ఆసుప‌త్రిలో వైద్యులు, మెడికల్‌ సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 58 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో స‌ద‌రు ఆసుప‌త్రిని తాత్కాలికంగా మూసివేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ఇక రెండు ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ గా తేలిన మెడికల్‌ సిబ్బంది సంఖ్య 88కి చేరింది. అదే విధంగా ఏప్రిల్‌ రెండో వారంలో ఇద్దరు వ్యక్తులకు గుండె సంబంధిత చికిత్స అందించిన అనంతరం మాక్స్‌ ఆసుపత్రికి చెందిన 39 మంది మెడికల్‌ సిబ్బంది తో పాటు డాక్టర్లు, నర్స్‌లు కూడా స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. ఇకపోతే , భారత్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 27,892కు చేరింది. దేశవ్యాప్తంగా కరోనా మృతి చెందినవారి సంఖ్య 872కు చేరిందని ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. అలాగే , దేశంలో యాక్టివ్‌ కరోనా కేసులు 20,835 కాగా, 6,185 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు.