Begin typing your search above and press return to search.
అర్థరాత్రి హైదరాబాద్ లో బైకుల్ని తగలెట్టేశాడు!
By: Tupaki Desk | 22 Jun 2019 6:59 AM GMTవాహనాల్ని రోడ్ల మీద పెట్టేసి వెళ్లే వారు చాలామందే కనిపిస్తారు హైదరాబాద్ లో. చాలా ప్రాంతాల్లో ఇంట్లో టూవీలర్ పెట్టుకోవటానికి వీల్లేని ఇళ్లు లక్షలాదిగా కనిపిస్తాయి. పాత నగరంలో ఇలాంటి వాటిని అర్థం చేసుకోవచ్చు. కొత్తగా అభివృద్ధి చేసిన పలు కాలనీల్లోనూ ఇదే దృశ్యం కనిపిస్తుంటుంది.
కొన్ని చోట్ల అయితే కార్లను సైతం రోడ్ల పక్కగా పెట్టేయటం చాలా చోట్ల కనిపిస్తుంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవటంలో గ్రేటర్ హైదరాబాద్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. అధికారుల ఉదాసీనత కారణంగా కొత్త సమస్యలు ఎదురువుతున్న పరిస్థితి. ఇందుకు నిదర్శనంగా రోడ్ల మీద వాహనాల్ని పెట్టేసే వారి గుండెలు అదిరిపోయే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది.
నగరంలోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటల మసీదు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఒక వ్యక్తి హల్ చల్ చేశారు. ఇళ్ల బయట.. రోడ్ల మీద పెట్టి ఉంచిన తొమ్మిది టూవీలర్స్ ను పెట్రోల్ పోసి తగులబెట్టేశాడు. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ పరిణామానికి షాక్ తిన్న పరిస్థితి.దీంతో ఉలిక్కిపడిన పోలీసులు.. విచారణ షురూ చేశారు.
ఈ సందర్భంగా వారు వాహనాల్ని కాల్చేసిన వ్యక్తిని గుర్తించారు. మతిస్థిమితం లేని మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి తాజాగా ఇంటి బయట పెట్టిన వాహనాల్ని తగలబెట్టేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలోనూ ఇతగాడు ఇలాంటి పనులు చేసినట్లుగా తెలుస్తోంది. తగలబడిపోయిన వాహనదారులు ఏం చేయాలో తోచక కిందామీదా పడుతున్నారు. బయట వాహనాల్ని పెట్టే అలవాటున్న వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని తాజా ఉదంతం చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.