Begin typing your search above and press return to search.
'భిలాయ్' లో ఘోర ప్రమాదం..9మంది మృతి!
By: Tupaki Desk | 9 Oct 2018 3:16 PM GMTఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లాలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్లాంట్ లోని కోక్ ఒవెన్ బ్యాటరీ కాంప్లెక్స్ 11 సెక్షన్ సమీపంలోని గ్యాప్ పైప్ లైన్ లో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మంటల ధాటికి మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం రెగ్యులర్ మెయింటెనెన్స్ లో భాగంగా కార్మికులు విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను హుటాహుటిన భిలాయి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు - సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. సెయిల్ చైర్మన్ అనిల్ కుమార్ చౌదరి - యూనియన్ స్టీల్ సెక్రటరీ బినయ్ కుమార్ లు నేడు ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు.
ఆ ప్రమాదంలో మృతి చెందిన వారిలో - క్షతగాత్రులలో రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల శరీరాలు 70-80 శాతం వరకు కాలిపోయాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వారందరికీ మెరుగైన వైద్యం అందించి, ప్రాణహాని లేకుండా చూసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని భిలాయ్ అధికారులు తెలిపారు. కాగా, 2014లోనూ ఇదే ప్లాంట్ లో భారీ ప్రమాదం సంభవించింది. గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు సీనియర్ అధికారులతో సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. వాటర్ పంప్ హౌస్ బ్రేక్ డౌన్ కావడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీకవడంతో ఆ ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోనే ఉత్తమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ గా భిలాయ్ స్టీల్ ప్లాంట్ 11 సార్లు ప్రధాని ట్రోఫీని గెలుచుకుంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ ఎఐఎల్) ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ నడుస్తోంది.