Begin typing your search above and press return to search.
ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి?
By: Tupaki Desk | 4 July 2016 6:09 AM GMTతొమ్మిదేళ్ల చిరు ప్రాయంలో ఆ పసి మనుసుకు మహా తెలిస్తే చాక్లెట్లు తినటం..స్నేహితులతో ఆడుకోవటం.. సరదాగా ఐస్ క్రీం తినాలనుకోవటం.. సినిమా చూడటం.. కాలక్షేపానికి కార్టూన్ నెట్ వర్క్ చూడటం లాంటివి తెలుస్తాయి.అంతేకానీ.. అత్యాచారం.. హత్య లాంటివి తనను వెంటాడి వేటాడుతాయని ఊహాకు కూడా రావేమో. కానీ.. ఈ దారుణాలన్నీ చిట్టితల్లికి ఎదురైతే ఆ పని హృదయం ఎంతగా విలవిలలాడి ఉంటుంది..?
హైదరాబాద్ లోని మచ్చ బొల్లారం పరిధిలో తొమ్మిదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి.. చంపేసిన ఉదంతం స్థానకంగానే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఈ ఉదంతంలో చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు ఆ చిన్నారికి అలాంటి పరిస్థితి ఎదురు కావటానికి కారణమైన తల్లిదండ్రులపైనా.. దారుణమైన ఆఘాయిత్యానికి పాల్పడిన కసాయి మీద కోపం రాక మానదు.
కళాసిగూడకు చెందిన రామకృష్ణ.. బబిత దంపతులకు ఇద్దరు పిల్లలు. రామకృష్ణ పెయింటర్ గా పని చేస్తుంటే.. బబిత ఆశా వర్కర్ గా పని చేస్తోంది.వీరిద్దరూ ఆదివారం కల్లు తాగేందుకు కల్లు కాంపౌండ్ కు తమ తొమ్మిదేళ్ల చిన్నారిని తీసుకెళ్లారు. చిన్న పిల్లల్ని కల్లు కాంపౌండ్ దగ్గరకు తీసుకెళ్లటం ఒక తప్పు అయితే.. పూటుగా తాగేసి మత్తులో మునిగిపోయిన వారి పరిస్థితిని చూసి.. పాత నేరస్తుడు దారుణానికి పాల్పడ్డాడు.
చిన్నారికి మాయమాటలు చెప్పి.. చాక్లెట్ కొనిపిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇతడి తీరును అనుమానించిన కల్లు కాంపౌండ్ యజమాని పిల్ల తల్లిదండ్రుల్ని హెచ్చరించినా.. అతడు తమకు పరిచయస్తుడేనన్న భరోసాతో పట్టించుకోలేదు. ఇక.. చిన్నారిని బయటకు తీసుకెళ్లిన మానవ మృగం (చింతకింది అనిల్) చిన్నరిని బయటకు తీసుకెళ్లి.. మాయమాటలతో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కాళ్లు.. చేతులు కట్టేసి అత్యాచారం చేసి..బండరాయిని మోది చిన్నారిని చంపేశాడు.
అక్కడ గస్తీ నిర్వహిస్తున్న మిలటరీ సిబ్బంది వీడి పైశాచిక చర్యను గుర్తించి..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులకు పట్టిచ్చారు. అనిల్ మీద ఇప్పటికి18 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన అతడు ఇంత దారుణానికి పాల్పడిన వైనం చూసినప్పుడు.. ఈ దుర్మార్గుడ్ని ఎలా శిక్షించాలి?అన్న సందేహం కలగక మానదు. ఇలాంటి మానవమృగాన్ని ఉరి తీసేందుకు ఏదైనా కోర్టు ఆదేశాలు ఇస్తే.. దాన్ని అమలు చేయటానికి ఏళ్లకు ఏళ్లు పట్టటమే కాదు.. నిండు ప్రాణాలు ఎలా తీస్తారంటూ మానవ హక్కుల సంఘం నేతలు నీతులు చెబుతూ రోడ్ల మీదకు వస్తారు. అలాంటి వారంతా ఇప్పుడీ దుర్మార్గుడి దుర్మార్గం మీద ఎందుకు మాట్లాడరు? ఎందుకు పెదవి విప్పరు?