Begin typing your search above and press return to search.

విడ్డూరం : 90 సెకన్ల విమాన ప్రయాణం

By:  Tupaki Desk   |   12 April 2023 2:39 PM GMT
విడ్డూరం : 90 సెకన్ల విమాన ప్రయాణం
X
విమాన ప్రయాణం అనేది మినిమంగా 30 నిమిషాలు అంతకు మించి ఉంటుంది. ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్లాలి అంటే అయిదు పది గంటలు.. అంతకు మించి సమయం కూడా పడుతుంది. ఒకే దేశంలోని ఒక పట్టణం నుండి మరో పట్టణంకు వెళ్లాలి అంటే కూడా కనీసం అర్థ గంట సమయం పడుతుంది. కానీ స్కాట్లాండ్‌ లోని రెండు దీవుల మధ్య విమాన ప్రయాణం కేవలం 90 సెకన్లు మాత్రమే ఉంటుంది.

ఆ 90 సెకన్లకు విమాన ప్రయాణం చేయడం అవసరమా అనుకోవచ్చు. కానీ ఒక దీవి నుండి మరో దీవికి ప్రయాణించాలంటే విమానయాన ప్రయాణం తప్ప మరేం లేదు. రెండున్నర కిలోమీటర్ల దూరం ఉండే ఆ రెండు దీవుల మధ్య బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చాలా ఏళ్లుగా జనాలు కోరుకుంటున్నారు. కానీ సాధ్యం కావడం లేదు.

సముద్ర ప్రయాణం సాగించాలని భావించినా కూడా అది రిస్క్ తో కూడుకున్నది.. అత్యవసరం అయితే విమాన ప్రయాణానికే ఎక్కువ శాతం జనాలు ఆసక్తి చూపిస్తారట. ఒక దీవిలో విమానం టేకాఫ్‌ అయ్యి.. మరో దీవిలో విమానం ల్యాండ్‌ అవ్వడానికి రెండున్నర నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది.

రెగ్యులర్ విమానాలు కాకుండా పది మంది మాత్రమే ప్రయాణించే వీలుండే చిన్న విమానాలను ఈ రెండు దీవుల మధ్య ప్రయాణానికి వినియోగిస్తున్నారు. ప్రభుత్వం ఈ దీవుల మధ్య ప్రయాణంకు జనాలకు రాయితీ ఇస్తుందట. మొత్తానికి ప్రపంచంలోనే అతి తక్కువ విమాన ప్రయాణంగా ఇది రికార్డుల్లో నిలిచింది.