Begin typing your search above and press return to search.

ఉపాధ్యాయుల్లో ఆందోళన ...కొరోనా కాటుకి 90 మంది బలి !

By:  Tupaki Desk   |   18 May 2021 2:00 PM IST
ఉపాధ్యాయుల్లో ఆందోళన  ...కొరోనా కాటుకి 90 మంది బలి !
X
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా కేసులు నమోదు అయ్యే రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. అయితే , కర్ణాటక రాష్ట్రంలో ఉపాధ్యాయులపై కరోనా పంజా విసురుతోంది. బెళగావి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఆదివారం వరకు 90 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కన్నుమూశారు. జిల్లాలో కరోనా వైరస్ మొదటి దశలో 23 మంది, రెండోదశలో 20 మంది, ఇదే జిల్లా చిక్కోడి పరిధిలో మొదటి దశలో 18 మంది, రెండో దశలో 29 మంది మృతిచెందినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ లో విజృంభిస్తున్న తరుణంలో లోక్‌ సభ సీటుకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ విధుల్లో పాల్గొన్నవారిలో 10 మంది ఉపాధ్యాయులను కరోనా కాటుకి బైయ్యారు. ప్రస్తుతం 53 మంది ఉపాధ్యాయులు కరోనా మహమ్మారి పాజిటివ్‌ తో చికిత్స పొందుతున్నారు.

దేశంలో రోజువారీ క‌రోనా కేసుల‌ సంఖ్య త‌గ్గుతోంది. నిన్న‌ కొత్త‌గా 2,63,533 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, నిన్న 4,22,436 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,52,28,996కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 4,329 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,78,719కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,15,96,512 మంది కోలుకున్నారు. కరోనా పాజిటివిటీ రేటు 14.09 శాతంగా ఉంది. దేశంలో మొత్తం 33 లక్షల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షల నుంచి రెండు లక్షల అరవై వేల వరకు రావడం మంచి పరిణామమే అయినప్పటికీ , మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.