Begin typing your search above and press return to search.
900 ఉత్తరాలు... న్యాయస్థానాన్ని కదిలించాయి
By: Tupaki Desk | 17 Aug 2015 9:18 PM GMTటీచర్లు ఎందుకు రావడం లేదు? తమకు ఎందుకు చదువు చెప్పడం లేదు? రోజు తాము పాఠశాలకు ఎందుకు వస్తున్నాం ? ఆడుకోవడానికా ? చదువుకోవడానికా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆ విద్యార్థుల మనస్సులో తలెత్తాయి. దీనికి వారు ఒక పరిష్కార మార్గం ఎంచుకున్నారు. ఏకంగా అందరికీ న్యాయం అందించే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అది కూడా రాష్ర్ట సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టుకు తమ ఆవేదన విన్నవించుకున్నారు.
విద్యార్థులు కదా... హైకోర్టులో పిటిషన్ ఎలా వేశారు? వారికి ఫిర్యాదు ఎవరు రాసిచ్చారు అనుకునేరు. పాఠ్యపుస్తకాల్లో చదవుకున్నట్లు ఉత్తరాన్ని తమ ఆయుధంగా ఎంచుకున్నారు. తమ పరిస్థితిని వివరిస్తూ హైకోర్టుకు లేఖలు రాశారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుకున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం చింతకుంట గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హైకోర్టుకు లేఖలు రాశారు. సుమారు 900 లేఖలు కోర్టుకు అందాయి.తమ పాఠశాలలో 300 విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉందని, 200 మంది విద్యార్థులుంటే ఒక టీచర్ కూడా లేదని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. తాము ఆడుకోవడానికి వస్తున్నామా ? చదువుకోవడానికి రావాలా ? అని లేఖలో ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థి తమ ఆవేదనను లేఖలో పొందుపరిచారు. దీన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. లేఖను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఇంత సీరియస్ గా ఉన్న ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. తమ దృష్టికి వచ్చిందని, విచారణ చేపడుతున్నట్లు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరణ ఇచ్చుకున్నారు. అయితే డీఈఓను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలుపాలని కోర్టు కోరింది. టీచర్లు ఉన్నా రాకుంటే తక్షణమే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణనను రెండ్రోజులకు వాయిదా వేసింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యే అవకాశం ఉంది. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని, కొంతమందిని సస్పెండ్ చేస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో రాని టీచర్లకు ఇది ఒక హెచ్చరికలాంటిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.