Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో 9వేల మంది కుబేరులు
By: Tupaki Desk | 23 Feb 2017 4:45 AM GMTహైదరాబాద్ లో రోజురోజుకి మిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం నగరంలో మిలియన్ డాలర్లకుపైగా సంపద ఉన్న వారి సంఖ్య తొమ్మిది వేలు అని తేలింది. డిసెంబరు 2016 నాటికి హైదరాబాద్ మొత్తం సంపద విలువ రూ.21.08 లక్షల కోట్లు (31 వేల కోట్ల డాలర్లు). ‘న్యూ వరల్డ్ వెల్త్’ ప్రకటించిన తాజా లెక్కల ప్రకారం.. భారత్ లో మొత్తం 2.64 లక్షల మంది వార్షికాదాయం 10 లక్షల డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. వీరిలో 9వేల మంది మిలియనీర్లు హైదరాబాద్ లో ఉన్నారు. సంఖ్యాపరంగా చూస్తే ముంబైలో అత్యధికంగా 46వేల మంది మిలియనీర్లు ఉన్నారు. కోల్ కతా (9,600) - హైదరాబాద్ (9,000) - బెంగళూరు (7,700) - చెన్నై (6,600) - పుణె (4,500) - గుర్గావ్ (4,000) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక దేశంలో 95 మంది వార్షిక ఆదాయమైతే 100 కోట్ల డాలర్ల పైమాటే.
కాగా, ఈ సర్వేలో తెలంగాణలో మూడో వంతు జనాభా హైదరాబాద్ మహానగరంలో ఉందని, అందుకే అభివృద్ధి విషయంలో ప్రణాళికాబద్దంగా పురోగమిస్తోందని పేర్కొంది. రాష్ట్రంలో 45 శాతం జీడీపీ హైదరాబాద్ నుంచే వస్తుందని విశ్లేషించింది. గత పదేళ్ల కాలంలో హైదరాబాద్ లోని కుబేరుల సంఖ్య పెరిగిందని వెల్త్ రిపోర్ట్ విశ్లేషించింది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై - రాజధాని ఢిల్లీతో పోటీ పడే రీతిలో హైదరాబాద్ లో మిలియనీర్లు పెరుగుతున్నారని వ్యాఖ్యానించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/