Begin typing your search above and press return to search.
తండ్రిని కాలదన్నిన కొడుకులకు తగిన శాస్తి
By: Tupaki Desk | 10 Aug 2019 5:57 AM GMTమొన్న సిరిసిల్లలో.. నిన్న కరీంనగర్ లో.. అదే కథ.. అదే వ్యథ.. రెక్కలు ముక్కలు చేసుకొని కనిపెంచిన కన్న తల్లి, తండ్రిని రోడ్డున పడేసిన ధౌర్భాగ్యపు కొడుకుల కథ.. వృద్ధాప్యంలో ఆసరా అవుతారనుకున్న కొడుకులు బస్టాండ్ ల్లో.. వృద్ధాశ్రమాల్లో.. చెట్ల కింద వదిలేస్తున్న విషాధ వ్యథ.
వృద్ధాప్యం పండుటాకులకు భారమవుతోంది. కని పెంచి పెద్దవాళ్లను చేస్తే ముదిమి వయసులో కొడుకులు ఆదుకుంటారనుకుంటే కాలదన్నుతున్నారు. దీంతో ఆ పండుటాకులు కన్నీరు కారుస్తూ రోడ్డునపడుతున్నారు. ఇది ఏ ఒక్కరి ఇంట్లో జరుగుతున్న సమస్య కాదు.. ప్రతీ ఊరిలో, పట్టణంలో తల్లిదండ్రులను వదిలేస్తున్న కన్నకొడుకుల కథ..
తాజాగా యాదాద్రి జిల్లాలోనే అదే కథ పునరావృతమైంది. యాదాద్రి జిల్లా రాజపేట గ్రామానికి చెందిన యాదగిరి(91) కి నలుగురు కొడుకులున్నా పోషించలేక రోడ్డున పడేశారు. నలుగురు కొడుకులను ప్రయోజకులను చేయాలని ముంబై వెళ్లి కష్టపడి ఆస్తులు కూడబెట్టాడు యాదగిరి. తన జీవితం ధారపోసి రాజపేటలో మూడు ఇళ్లు.. భువనగిరిలో ఆస్తులు కూడ బెట్టాడు. ఆ ఆస్తులు లాక్కొని యాదగిరిని నడిరోడ్డుపై వదిలేశారు కర్కష కొడుకులు. 91 ఏళ్ల వృద్ధాప్యంలో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో యాదగిరి భోరుమన్నాడు.
యాదగిరి భార్య 20 ఏళ్ల కింద చనిపోయింది. అప్పటి నుంచి ఈయనకు కష్టాలు మొదలయ్యాయి. భార్యపోయిన బాధ దిగమింగుకొని కొడుకులతో ఆనందంగా బతుకుదామని ఆశించాడు. కానీ కొడుకులు ఆస్తులు లాక్కొని యాదగిరిని పట్టించుకోలేదు. కోడళ్లు యాదగిరిని ఇంటి నుంచి గెంటేశారు. బట్టలు, , మంచం బయటపడేసి వెళ్లిపోమ్మని చీదరగొట్టారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న యాదగిరి కూతుళ్ల వద్దకు వెళ్లి ఆశ్రయం పొందాడు. ఉన్న కొద్ది డబ్బును కూతుళ్లకు ఇస్తావుంటే కొడుకులు వచ్చి డబ్బు లాక్కొని వెళ్లారు. ఇక తన మూడు ఇళ్లను తన బాగోగులు చూసుకుంటున్న కూతుళ్లకు ఇస్తానని యాదగిరి డిసైడ్ కావడంతో చిచ్చు రేగింది. పంచాయతీ పెట్టారు.. పోలీస్ స్టేషన్ లో యాదగిరిపై కొడుకులు కేసులు పెట్టారు. తండ్రి ఆస్తులు ఇవ్వనని చెప్పడంతో కిడ్నాప్ కు యత్నించారు. చివరకు కూతుళ్ల సాయంతో భువనగిరిలోని వయోవృద్ధుల సంరక్షణ చట్టం ట్రిబ్యూనల్ కు యాదగిరి ఫిర్యాదు చేశాడు.
ట్రిబ్యూనల్ సంచలన తీర్పునిచ్చింది. తండ్రిని పోషించని కొడుకులకు చెంపపెట్టులాంటి షాక్ ఇచ్చింది. సొంత ఊరిలో యాదగిరి సంపాదించిన మూడు ఇళ్లను వృద్ధుడైన యాదగిరికే చెందాలని తీర్పునిచ్చింది. దీంతో యాదగిరి ఆనందం వ్యక్తం చేశాడు. తనను చూసుకుంటున్న కూతుళ్లకే ఆ ఇళ్లను ఇస్తానని ఉద్వేగంతో కన్నీళ్ల పర్యంతం అవుతూ చెప్పుకొచ్చాడు.
ఇలా తండ్రులను కాలదన్నిన కొడుకులకు ట్రిబ్యూనల్స్ వరంలా మారుతున్నాయి. చాలా మంది వృద్ధులకు అసలు ఇలాంటి న్యాయం జరుగుతుందనే విషయం కూడా తెలియదు. వారికోసం చట్టాలున్నాయని.. అవి మనల్ని పరిరక్షిస్తాయని విషయం తెలిస్తే వృద్ధాప్యంలో తండ్రులకు న్యాయం జరుగుతుంది.