Begin typing your search above and press return to search.
94 మంది ఐసిస్ ఉగ్రవాదులు హతం..ట్రంప్ ఖుషీ
By: Tupaki Desk | 15 April 2017 10:16 AM GMTఆఫ్ఘనిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థ ఐఎస్ స్థావరంపై అమెరికా జరిపిన భారీ వాయు విస్ఫోటన బాంబు(మాబ్) దాడిలో డజన్ల కొద్దీ ఉగ్రవాదులు హతమైనట్టు వార్తలు వెలువడినప్పటికీ దాన్ని కొట్టిపారేసి ఐసిస్ ప్రకటన తప్పని తేలింది. అణ్వస్త్రేతర బాంబులన్నిటిలోకి అత్యంత శక్తిమంతమైన జీబీయూ-43/బీని అమెరికా సైన్యం తూర్పు నంగర్ హార్ ప్రావిన్స్ లోని అచిన్ జిల్లాలో ఐఎస్ నిర్మించుకున్న సొరంగ స్థావరంపై ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఆ బంకర్లు - సొరంగాలలో ఆ మహాబాంబు బీభత్సం సృష్టించింది. దాదాపు 94 మంది ఉగ్రవాదులు ఈ భీకరదాడిలో హతులైనట్టు ఆఫ్ఘన్ రక్షణశాఖ వెల్లడించింది. ఐఎస్ సొరంగాల నెట్ వర్క్ ఈ బాంబుదాడిలో కుప్పకూలిందని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు.
ఈ దాడిలో 36 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే దీన్ని ఐసిస్ ఖండిస్తూ తమకు ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది. దీంతో అమెరికా ప్రయత్నం విఫలమైందా అని మీడియాలో చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బాంబు దాడికి సంబంధించి తాజాగా అఫ్ఘనిస్థాన్ అధికారిక ప్రతినిధి అచ్చిన్ జిల్లా గవర్నర్ ఇస్మాయిల్ షిన్ వారి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 94మంది ఐసిస్ ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలిపారు. మరోవైపు ఈ దాడి నేపథ్యంలో అమెరికా సైన్యాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టీంను ప్రశంసించారు. దాడి చాలా చాలా విజయవంతమైందని ట్రంప్ మెచ్చుకున్నారు. ఇది మరొక విజయవంతమైన దాడి.. సైన్యం సాధించిన ఈ విజయం పట్ల మేం ఎంతో గర్విస్తున్నాం అని ట్రంప్ వైట్ హౌస్ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
మరోవైపు తన అనుమతితోనే దాడి జరిగిందని అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకోగా మాబ్ బాంబు వినియోగానికి ప్రత్యేకించి అధ్యక్షుని అనుమతి అవసరం లేదని అధికారులు తెలిపారు. కాగా ఐఎస్ పై మహాబాంబు దాడి జరుపడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. రిపబ్లికన్ ప్రజాప్రతినిధులు ట్రంప్ సర్కారును అభినందనల్లో ముంచెత్తుతుండగా డెమొక్రాటిక్ నేతలు మాత్రం ట్రంప్ తీరుపై మండి పడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/