Begin typing your search above and press return to search.

94 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు

By:  Tupaki Desk   |   15 Dec 2018 5:30 PM GMT
94 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
X
ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మ‌రో కీల‌క అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎంపికైన 230 మంది ఎమ్మెల్యేల్లో 94 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. 94 మందిలో 47 మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన నేరారోపణలు - హత్య - హత్యాయత్నం కేసులు ఉన్నట్లు తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 114 మంది ఎమ్మెల్యేల్లో 56 మంది ఎమ్మెల్యేలు(49 శాతం) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు ఎన్నికల నామినేషన్ ఆఫిడవిట్ లో పేర్కొన్నారు.

109 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 34 మంది ఎమ్మెల్యేలు(31 శాతం), ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు - సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే - ఒక స్వతంత్ర ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులున్నట్లు ఆఫిడవిట్ లో పేర్కొన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. కాంగ్రెస్ నుంచి 28 - బీజేపీ నుంచి 15 - బీఎస్పీ నుంచి ఇద్దరు - ఎస్పీ నుంచి ఒకరు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇక 230 మంది ఎమ్మెల్యేల్లో 187(81 శాతం) మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు ఉన్నారు. కోటీశ్వరుల్లో బీజేపీ నుంచి 91 మంది, కాంగ్రెస్ నుంచి 90 - నలుగురు స్వతంత్రులు - బీఎస్పీ - ఎస్పీ నుంచి ఒక్కొక్కరు చొప్పున రూ. కోటికి పైగానే ఆదాయం కలిగి ఉన్నారు. 2013 ఎన్నికల్లో శాసనసభకు ఎంపికైన వారిలో 161 మంది కోటీశ్వరులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది.