Begin typing your search above and press return to search.

94 ఏళ్ల అథ్లెట్ బామ్మ గోల్డ్‌ మెడల్‌

By:  Tupaki Desk   |   12 July 2022 2:30 AM GMT
94 ఏళ్ల అథ్లెట్ బామ్మ గోల్డ్‌ మెడల్‌
X
130 కోట్ల మంది జనాభా ఉన్న ఇండియాలో అథ్లెట్స్ సంఖ్య చాలా తక్కువ. పదుల కోట్ల జనాభా ఉన్న దేశాలు ఒలింపిక్స్ లో అథ్లెట్స్ గా పదుల సంఖ్యలో బంగారు పథకాలు దక్కించుకుంటూ ఉంటే మన దేశం మాత్రం ఒకటి రెండు బంగారు పథకాలు వస్తేనే గొప్ప విషయం అన్నట్లుగా చంకలు గుద్దుకుని మరీ ఆనందంతో పండుగ చేసుకుంటూ ఉన్నాం.

పాతికేళ్లు.. మూడు పదుల వయసులో ఉన్న వారు బంగారు పథకాలను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి విఫలం అవుతూ ఉంటే 94 ఏళ్ల బామ్మ భగవాని దేవి ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో అథ్లెట్‌ గా బంగారు పథకంను దక్కించుకుని మొత్తం ప్రపంచం ముక్కున వేలే వేసుకునేలా చేసింది. ఆమె సాధించిన ఘనత గురించి అంతా చర్చించుకుంటున్నారు.

వరల్డ్‌ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్స్ 2022 లో 100 మీటర్ల స్ప్రింట్‌ ఈవెంట్‌ లో 24.74 సెకన్లలో అద్బుత విజయాన్ని సొంతం చేసుకుని గోల్డ్‌ మెడల్ ను దక్కించుకుంది.

షాట్ పుట్‌ లో కూడా కాంస్య పతకాన్ని దక్కించుకోవడం ద్వారా అరుదైన రికార్డు ను నమోదు చేసింది. దేశ వ్యాప్తంగా ఎంతో మంది అథ్లెట్స్ ఉన్నారు. వారందరికి కూడా ఆమె ఆదర్శం కావాలి.

ఫిన్‌లాండ్‌ లో జరిగిన ఈ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భగవాని దేవి గారికి అంత సులభంగా అవకాశం రాలేదు. జాతీయ స్థాయి పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా మాత్రమే ఆమెకు అంతర్జాతీయ స్థాయి పోటీట్లో పాల్గొనే అవకాశం ను కల్పించారు.

దేశ జెండా ను చూపిస్తూ సగర్వంగా భగవాని దేవి గారు తన విజయాన్ని ప్రపంచానికి చూపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మరియు భగవాని దేవి గారు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నారు.