Begin typing your search above and press return to search.

కరోనా ధాటికి ప్రపంచం విలవిల.. 95 శాతం ఒమిక్రాన్ కేసులే!

By:  Tupaki Desk   |   6 Jan 2022 4:30 PM GMT
కరోనా ధాటికి ప్రపంచం విలవిల.. 95 శాతం ఒమిక్రాన్ కేసులే!
X
కరోనా మహమ్మారి గతకొద్ది రోజులుగా పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్నిదేశాల్లోనూ మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు రెండేళ్ల నుంచి కూడా వైరస్ ప్రభావం కొనసాగుతూనే ఉంది. వేరియంట్ల మాదిరిగా విరుచుకుపడుతోంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ వల్ల అధిక కేసులు నిర్ధారణ అవుతున్నాయి. మొన్నటిదాకా పదుల సంఖ్యలో ఉన్న కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు.. ఇప్పుడు లక్షలకు చేరుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఆ దేశంలో రోజుకు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 5లక్షలకు పైగా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇకపోతే సగటున ఐదు లక్షలదాకా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. గతవారం రోజులుగా సగటున దాదాపు 15వేల మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు.


ఐరోపా దేశాల్లోనూ మహమ్మారి పంజా విసురుతోంది. తొలుత లండన్ లో ఈ కేసులు భారీగా నమోదవయ్యాయి. ఫ్రాన్స్ లో మంగళవారం దాదాపు 2.7 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటలీలో కేవలం 24 గంటల్లో 1.8 కేసులు గుర్తించారు. మరో 222 మంది ప్రాణాలు కోల్పోయారు. 30వేల మంది మహమ్మారి ధాటికి బలయ్యారు. ఇక స్పెయిన్ లో ఒక్కరోజే 1.11లక్షల మందిలో వైరస్ బయటపడింది. 16మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోగా... 13వేల మంది వైరస్ ను జయించారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్లే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు.

ఇక ముందునుంచి వ్యాక్సినేషన్ లో ఇజ్రాయెల్ తొలి స్థానంలో నిలుస్తోంది. ఏకంగా నాలుగో డోసును కూడా ఇందిస్తున్నారు. ఆగస్టులోనే అందరికీ మూడో డోసును ఇచ్చారు. అలాంటిది ఆ దేశంలో కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఏకంగా 11వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్డెంబర్ ఒక్కరోజులో 11,345 కేసులు నమోదయ్యాయి. కాగా మంగళవారం నమోదైన 11,978 కేసులతో మరో కొత్త రికార్డు నమోదైంది. వ్యాక్సినేషన్ చురుగ్గా ఉన్నా దేశంలోనూ ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇకపోతే ప్రపంచ దేశాలు రాకపోకలపై ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. భారత విమానాలపై హాంకాంగ్ ఆంక్షలు విధించింది. అంతేకాకుండా మరో ఏడు దేశాలపై కూడా ఇవే నిబంధనలు వర్తింపజేసింది.

బ్రిటన్ లోనూ వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 2,18,274 లక్షల కేసులు నమోదయ్యాయి. 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50వేల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇక భారత్ లోనూ 90వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కొన్ని ప్రభుత్వాలు పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల లాక్ డౌన్ విధించే పరిస్థితి రాదని నిపుణులు చెబుతున్నారు. వైరస్ బారిన పడినా కూడా కోలుకోవడం సులభతరమేనంటున్నారు.